చిరు నుంచి బాలయ్య వరకు హోస్ట్ గా చేసిన స్టార్ నటులు వీళ్ళే!

ఒకప్పుడు కేవలం వెండితెరపై పలు సినిమాలలో హీరోగా నటిస్తూ తన సత్తాను చాటుకున్న సెలబ్రిటీలు ప్రస్తుతం బుల్లితెరపై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తూ తమదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

 Star Heroes Who Have Become Anchors Chiranjeevi Balakrishna-TeluguStop.com

ఇప్పటివరకు బుల్లితెరపై గా హోస్ట్ గా వ్యవహరించిన హీరోలు ఎవరనే విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.అదేవిధంగా నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఇకపోతే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ మొదటి సీజన్, ప్రస్తుతం జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

 Star Heroes Who Have Become Anchors Chiranjeevi Balakrishna-చిరు నుంచి బాలయ్య వరకు హోస్ట్ గా చేసిన స్టార్ నటులు వీళ్ళే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Balakrishna, Chiranjeevi, Evaru Meelo Koteeswarulu, Jagapathi Babu, Manam, Nagarjuna, Nani, Ntr, Saikumar, Tollywood, Tollywood Host Shows Heroes, Ustoppable-Movie

ఇకపోతే నాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్ 2 కి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.అదేవిధంగా దగ్గుబాటి వారసుడు రానా నెంబర్ వన్ యారి అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు.అలాగే సీనియర్ హీరోలు జగపతిబాబు కో అంటే కోటి అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, డైలాగ్ కింగ్ సాయికుమార్ వావ్, మనం వంటి కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించారు.

ఇదిలా ఉండగా తాజాగా నందమూరి నటసింహం బాలయ్య బాబు కూడా అన్ స్టాపబుల్ అనే కార్యక్రమం ద్వారా హోస్ట్ గా మారనున్నారు.

#Nani #Manam #Ustoppable #EvaruMeelo #Jagapathi Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube