జూన్ పైనే ఆశలు పెట్టుకున్న స్టార్ హీరోలు.. ఎందుకో తెలుసా?

ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలంతా వరుస సినిమాలలో అవకాశాలు అందుకొని తెగ బిజీగా ఉన్నారు.కానీ ఉన్నట్టుండి దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభించడంతో.

 Star Heroes Hopes On June, Covid, Lockdown, Movie Shootings Stopped, Star Heroes-TeluguStop.com

దీని ప్రభావం సిని ఇండస్ట్రీపై ఎక్కువగా పడింది.స్టార్ హీరోలంతా తమ సినిమాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.

గత ఏడాది కూడా స్టార్ హీరోల సినిమాలకు ఇదే జరగగా.ఈ ఏడాది కూడా పెద్ద పెద్ద సినిమాల పై మరింత ప్రభావం చూపిస్తుంది.


దేశంలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే.కానీ అంతకుముందే సినీ ఇండస్ట్రీలో వరుస కరోనా కేసులు రావడంతో కొందరు తమ సినిమాలకు వాయిదా పెట్టారు.

ఇక మరికొన్ని షూటింగులు పలు జాగ్రత్తలతో చేస్తున్న సమయంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.దీంతో చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు వాయిదాలు పడగా.

సెలబ్రిటీలంతా ఇంట్లోనే ఉంటున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే షూటింగులు ఆగిపోయి నెల రోజులు అవుతుండగా.

ప్రభుత్వం ఈ నెల ఆఖరి వరకు లాక్ డౌన్ విధించింది.ఇక ఈ నేపథ్యంలో సెకండ్ వేవ్ మొదలైనప్పుడు వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండగా.

ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల, పలు జాగ్రత్తలతో ఉండడంవల్ల అంతేకాకుండా లాక్‌డౌన్‌ విధించడం వల్ల కొంతవరకు వైరస్ వ్యాప్తి తగ్గుతుంది.ఇక రానున్న ముందు రోజుల్లో కూడా వైరస్ తీవ్రత తగ్గుతున్నట్లు అనిపించడంతో.

జూన్ వరకు కాస్త కుదుట పడుతుందని ఆలోచనలు ఉన్నాయి.దీంతో జూన్ రెండు వారాలు తర్వాత మూడవ వారం నుండి షూటింగ్స్ మొదలు పెట్టాలని సినీ ఇండస్ట్రీలు ఎదురుచూస్తున్నాయి.

ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు ఆఖరి దశలో ఉండగా.లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత వెంటనే తమ షూటింగులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

దీంతో స్టార్ హీరోలంతా ఆశలన్ని జూన్ పైనే పెట్టుకున్నారని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube