క్లాష్ అవుతున్న స్టార్ హీరోల సినిమాలు.. ఎవరు తగ్గుతారో..?

కేంద్రంలో అధికారంలో మోదీ సర్కార్ నేటి నుంచి దేశవ్యాప్తంగా 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను రన్ చేయడానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.గడిచిన నాలుగు రోజుల్లో స్టార్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలకు సంబంధించి దాదాపు 15 సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడ్డాయి.

 Star Heroes Movies Release Dates Clash In Tollywood Film Industry,tollywood,naga-TeluguStop.com

అయితే సినిమాల రిలీజ్ డేట్లు క్లాష్ అవుతున్న నేపథ్యంలో సినీ ప్రేక్షకుల మధ్య ఏ హీరో వెనక్కు తగ్గుతారో అనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

Telugu Khiladi, Dates Clash, Heroes, Tollywood-Movie

ఈ ఏడాది ఏప్రిల్ 16వ తేదీన సినిమా విడుదల చేస్తున్నట్టు మొదట టక్ జగదీష్ చిత్ర యూనిట్ ప్రకటించింది.కానీ నాగచైతన్య హీరోగా నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా కూడా అదే తేదీన విడుదల కావడానికి సిద్ధమవడంతో ఇద్దరు హీరోలలో ఎవరో ఒకరు రిలీజ్ డేట్ ను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.వకీల్ సాబ్ విడుదలైన వారానికే ఈ రెండు సినిమాలు విడుదలవుతూ ఉండటం గమనార్హం.నాని, నాగచైతన్యలలో ఎవరో ఒకరు వెనక్కు తగ్గుతారో లేక రెండు సినిమాలు ఒకేరోజు విడుదలవుతాయో చూడాల్సి ఉంది.

Telugu Khiladi, Dates Clash, Heroes, Tollywood-Movie

సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన నారప్ప మే 14వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటన వెలువడగా ఆ ప్రకటన వెలువడిన కొంత సమయానికే ఆచార్య సినిమాను మే 13వ తేదీ విడుదల చేస్తున్నట్టు ప్రకటన వెలువడింది.నారప్ప సినిమా డేట్ మార్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరగగా ఆ ప్రచారం నిజమవుతుందో లేదో తెలియాల్సి ఉంది.మరోవైపు ఖిలాడీ చిత్రాన్ని మే 28వ విడుదల చేస్తున్నట్టు ప్రకటన వెలువడగా అదే రోజు బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా విడుదల కానుంది.

మే 28వ తేదీ స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి కావడంతో బాలకృష్ణ రిలీజ్ డేట్ విషయంలో వెనక్కు తగ్గే అవకాశాలు కనిపించడం లేదు.

మరోవైపు ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.మరి రవితేజ ఖిలాడీ సినిమాను మే 28నే విడుదల చేస్తారో లేదో తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube