గుండుతో కనిపించి ఆశ్చర్యపోయేలా చేసిన స్టార్ హీరోలు వీళ్లే...

సినీ పరిశ్రమలో సక్సెస్ సాధించాలంటే అంత సులభం కాదు.ఎంతో కష్టపడితే మాత్రమే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలతో పాటు గుర్తింపు లభిస్తుంది.

 Star Heroes In Tonsured Look Goes Viral, Tollywood Heroes Bald Look, Bald, Chira-TeluguStop.com

ఏదో తూతూ మంత్రంగా ప్రయత్నిస్తే మాత్రం సక్సెస్ ఎప్పటికీ సొంతం కాదు.సినిమాసినిమాకు లుక్ తో పాటు డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ విజయాలు సాధిస్తే మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ గా ఎదగడం సాధ్యమవుతుంది.

Telugu Balakrishna, Bald, Chiranjeevi, Nagarjuna, Tonusured, Uday Kiran-Movie

తాజాగా చిరంజీవి క్లీన్ షేవ్ తో గుండు లుక్ లో కనిపించిన ఫోటో తెగ వైరల్ అవుతోంది.వేదాళం సినిమా ట్రయల్ షూట్ కోసం ఆయన ఈ లుక్ లో కనిపిస్తున్నారని తెలుస్తోంది.అయితే చిరంజీవితో పాటు ఇతర స్టార్ హీరోలు కూడా గుండు లుక్ లో కనిపించి అభిమానుల మెప్పు పొందారు.

Telugu Balakrishna, Bald, Chiranjeevi, Nagarjuna, Tonusured, Uday Kiran-Movie

స్టార్ హీరో బాలకృష్ణ కొన్ని రోజుల క్రితం గుండు లుక్ లో దర్శనం ఇచ్చారు.బాలయ్య బోయపాటి సినిమా కోసమే బాలకృష్ణ గుండు చేయించుకున్నారని ప్రచారం జరగగా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

Telugu Balakrishna, Bald, Chiranjeevi, Nagarjuna, Tonusured, Uday Kiran-Movie

మరో స్టార్ హీరో నాగార్జున సినిమా కోసం గుండు చేయించుకోకపోయినా దేవునికి తలనీలాలు ఇచ్చి ఆ లుక్ లో దర్శనమిచ్చారు.

Telugu Balakrishna, Bald, Chiranjeevi, Nagarjuna, Tonusured, Uday Kiran-Movie

ఉదయ్ కిరణ్, శ్రీహరి, ఉదయ్ కిరణ్ లాంటి నటులు కూడా దేవునికి తలనీలాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు.

Telugu Balakrishna, Bald, Chiranjeevi, Nagarjuna, Tonusured, Uday Kiran-Movie

ప్రస్తుతం మిడిల్ రేంజ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ కుడా కెరీర్ మొదట్లో గుండు లుక్ లో దర్శనమిచ్చారు.మహేశ్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నిజం సినిమా కోసం గోపీచంద్ గుండు లుక్ లో దర్శనమిచ్చారు.

Telugu Balakrishna, Bald, Chiranjeevi, Nagarjuna, Tonusured, Uday Kiran-Movie

ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ శివాజీ సినిమాలో పోషించిన గుండూ బాస్ పాత్ర ఆయనకు మంచిపేరు, గుర్తింపు తెచ్చిపెట్టింది.

Telugu Balakrishna, Bald, Chiranjeevi, Nagarjuna, Tonusured, Uday Kiran-Movie

అన్నాదమ్ముళ్లైన కార్తి, సూర్యలలో అన్న గజిని సినిమాలో గుండు లుక్ లో దర్శనం ఇవ్వగా తమ్ముడు కార్తీ కాష్మోరా సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ శేషు సినిమాలో, మోహన్ బాబు శివ్ శంకర్ సినిమాలో గుండు లుక్ లో దర్శనమిచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube