మ్యూజిక్ డైరెక్టర్ థమన్ వెంట పడుతున్న హీరోలు.. ఎందుకంటే..?

కెరీర్ మొదట్లో చిన్న సినిమాలకు సంగీతం అందించి కిక్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న థమన్ కు ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి.స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు తమ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ నే ఎంపిక చేసుకుంటున్నారు.

 Star Heroes Following Music Director Thaman Why Because, Continous Offers, Sarka-TeluguStop.com

ఈ ఏడాది విడుదల కాబోయే సినిమాలలో మెజారిటీ సినిమాలకు థమన్ సంగీతం అందిస్తుండటం గమనార్హం.వేగంగా మ్యూజిక్ ఇవ్వడంతో పాటు థమన్ ఎక్కువ పారితోషికం డిమాండ్ చేయకపోవడం వల్లే అతనికి వరుసగా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.

ఈ ఏడాది విడుదలైన తొలి పెద్ద సినిమా క్రాక్ థమన్ కు మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి పేరును తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.తక్కువ సమయంలో క్వాలిటీ మ్యూజిక్ ఇస్తూ ఉండటం వల్లే దర్శకనిర్మాతలు సైతం థమన్ తో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇస్తాడని థమన్ కు పేరు ఉండటంతో ఎక్కువ మంది హీరోలు థమన్ వెంటపడుతున్నారని తెలుస్తోంది.

Telugu Offers, Thaman, Heroes, Vakeel Saab-Movie

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న సర్కార్ వారి పాట, పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న వకీల్ సాబ్, అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ నాని హీరోగా నటిస్తున్న టక్ జగదీష్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు థమన్ చేతిలో ఉన్నాయి.ఒకప్పుడు రొటీన్ మ్యూజిక్ ఇస్తున్నాడనే విమర్శలను మూటగట్టుకున్న థమన్ వరుణ్ తేజ్ తొలిప్రేమ, అరవింద సమేత సినిమాలతో ఆ ముద్రను చెరిపివేసుకున్నాడు.

ఇప్పటికే 125 సినిమాలకు సంగీతం అందించిన థమన్ మరో నాలుగేళ్లలో సులువుగా 200 సినిమాలకు సంగీతాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది.

గతంలో నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దేవి శ్రీ ప్రసాద్ కు థమన్ గట్టి పోటీని ఇస్తున్నాడు.గతేడాది విడుదలైన అల వైకుంఠపురములో సినిమాలోని పాటలు యూట్యూబ్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube