స్టార్ హీరోల అభిమానుల మధ్య చిచ్చు పెడుతున్న వినాయక చవితి సంబరాలు!

Star Heroes Fans Wars Vinayaka Chavithi Celebrations, Vinayaka Chavithi Celebrations,Star Heroes,Fans Wars,Twitter War,Prabhas,Allu Arjun,Pawan Kalyan,NTR

సోషల్ మీడియా లో స్టార్ హీరోల అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్( Star Heroes Fans War ) జరుగుతుండడం సర్వసాధారణం అనే విషయం మన అందరికీ తెలిసిందే.ఇది కొత్తగా జరుగుతున్నది కాదు, సోషల్ మీడియా ప్రారంభమైన రోజుల నుండే జరుగుతున్నాయి.

 Star Heroes Fans Wars Vinayaka Chavithi Celebrations, Vinayaka Chavithi Celebrat-TeluguStop.com

మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ, ఉన్న విలువైన సమయాన్ని వృధా చేసుకొని కొట్టుకుంటూ ఉంటారు ఇక్కడ.ఇక ట్విట్టర్ వచ్చిన తర్వాత ఈ ఫ్యాన్ వార్స్ తారాస్థాయికి చేరుకుంది.

హీరోల అభిమానులు ప్రతీ విషయం లోను గొడవ పడుతూ మా హీరోనే గొప్ప అని పోస్టులు వేస్తుంటారు.గతం లో పవన్ కళ్యాణ్ మరియు మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో గొడవలు పడేవారు, ఆ తర్వాత రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య ఆ, అలాగే అల్లు అర్జున్ మరియు ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి.

Telugu Allu Arjun, Fans Wars, Pawan Kalyan, Prabhas, Heroes, War-Movie

ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే వినాయక చవితి పూర్తి అయిన సంగతి అందరికీ తెలిసిందే.పల్లెల్లో మరియు పట్టణాల్లో వినాయక చవితి సంబరాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటాయి.కానీ ఈమధ్య స్టార్ హీరోల అభిమానులు లేదా రాజకీయ నాయకుల కార్యకర్తలు ప్రత్యేకంగా గణపతి విగ్రహాలను( Lord Ganesh Idols ) ఏర్పాటు చేసి సంబరాలు చేస్తున్నారు.అలా మన టాలీవుడ్ నుండి ఈ ఏడాది పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ మరియు ప్రభాస్ అభిమానులు ఘనంగా చేసారు.

వీరిలో ఎక్కువ పవన్ కళ్యాణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య మా హీరో కి ఎక్కువ సెలెబ్రేషన్స్ జరిగాయి అంటూ ఇరువురు పోటాపోటీగా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉన్నారు.ఇదంతా చూసి దేవుడికి సంబరాలు జరిపించిన విషయం గురించి కూడా కొట్లాడుకోవాల్నా?, పనిపాట లేదారా మీకు అని కొంతమంది నెటిజెన్స్ పెదవి విరుస్తున్నారు.

Telugu Allu Arjun, Fans Wars, Pawan Kalyan, Prabhas, Heroes, War-Movie

ట్విట్టర్( Twitter War ) లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పోటీ గురించే చర్చ, ఎవరికీ ఎక్కువ వీడియోలు వచ్చాయి అని పందెం వేసుకుంటున్నారు.అభిమానం ఉండొచ్చు కానీ మరీ ఈ రేంజ్ లో మితి మీరడం సరికాదు అంటూ కొంతమంది అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు.ఏదైనా కాలక్షేపం గా ఉండాలి కానీ, అదేపనిగా పెట్టుకుంటే నష్టపోయేది మీరే, సినిమా హీరోల మీద అంత వెర్రి అభిమానం పెట్టుకోవడం మంచిది కాదు, వాళ్లకి కనీసం నీ ముఖం కూడా తెలియదు అంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube