జ‌గ‌న్‌కు ఈ స్టార్ హీరోల ప్ర‌చారం...     2018-06-12   03:10:09  IST  Bhanu C

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం కోసం ఫైట్ చేస్తోన్న విప‌క్ష వైసీపీ కోసం సినిమా రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు, స్టార్స్ క‌దిలి వ‌స్తున్నారు. ఇప్ప‌టికే తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో చాలా మంది వైసీపీకి, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్‌కు ఓపెన్‌గానే మ‌ద్ద‌తు ఇస్తున్నారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ ఇటీవ‌ల జ‌గ‌న్‌ను అభినందించ‌డంతో పాటు పాద‌యాత్ర‌కు వ‌స్తోన్న స్పంద‌న చూస్తే జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని చెప్పారు.

ఇక పోసాని ఓపెన్‌గానే జ‌గ‌న్‌కు స‌పోర్ట్ చేస్తున్నారు. ఆయ‌న నిన్న‌టికి నిన్న ప్రెస్‌మీట్ పెట్టి చంద్ర‌బాబు, టీడీపీ, లోకేష్‌ను ఏకేయ‌డంతో పాటు జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేశారు. ఇక రాజా, విజ‌య్‌చంద‌ర్ లాంటి వాళ్ల మ‌ద్ద‌తు ఎప్పుడూ జ‌గ‌న్‌కే అన్న సంగ‌తి తెలిసింది. తెలుగులో మ‌రో అగ్ర హీరో నాగార్జున ఇన్ డైరెక్టుగా జ‌గ‌న్‌తోనే ట‌చ్‌లో ఉంటున్నార‌ని…ఆయ‌న భార్య అమ‌ల వైసీపీ నుంచి ఎంపీగా పోటీ చేసే ఛాన్సులు కూడా ఉన్నాయ‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.