సినిమాల్లో నటించడం అంత సులభమైన విషయమేమీ కాదు.ముఖ్యంగా హీరో అన్ని భావాలను పలికిస్తూ ఉండాలి.
అద్భుతంగా డ్యాన్స్ చేయాలి, భీకరమైన ఫైట్లు కూడా చేయాలి.ఇక ఫిట్నెస్ మెయింటైన్( Fitness ) చేయడం సరే సరి.సినిమాల్లో రాణించాలంటే ఇవన్నీ నేర్చుకోవడంతోపాటు కొన్ని వదిలేయాల్సి కూడా ఉంటుంది.వాటిలో మొహమాటం ఒకటి.
అలాగే పిరికితనాన్ని కూడా వీరు వదులుకోవాలి.లేదంటే స్టార్ హీరో( Star Hero ) అయితే అవ్వగలరు కానీ మంచి నటుడు అవ్వలేరు.
కొంతమంది హీరోలు మంచి నటుడుగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.ఎంత స్టార్డం వచ్చినా, కోట్ల మంది అభిమానులను సంపాదించినా మంచి నటుడు అనే పొగడ్తే వారికి సంతృప్తిని ఇస్తుంది.
అయితే కొందరు హీరోలు అభిమానుల కోసమే సినిమాలు చేస్తారు.ఫ్యాన్స్ కి నచ్చే హీరోయిజాన్ని ప్రతి సినిమాలో చూపించాలని కోరుకుంటారు.
హీరోయిజాన్ని తగ్గించే, హీరో లక్షణాలు లేని పాత్రలు చేయడానికి వీరు అసలు ఇష్టపడరు.ఎక్కడ పాపులారిటీ తగ్గిపోతుందేమో, ఎక్కడ చెడ్డ పేరు వస్తుందేమో అని భయపడిపోతుంటారు.
అయితే ఇద్దరు టాలీవుడ్ హీరోలు మాత్రం మిగతా హీరోలందరికీ భిన్నం.ఎందుకంటే వారు యాంటీ హీరో లక్షణాలు ఉన్న పాత్రలు చేశారు.

పుష్ప సినిమా( Pushpa Movie )లో అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎంత వరస్ట్ గా ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు.పెళ్లి పీటల మీదకు వెళ్లేటప్పుడు బట్టలేకుండా అల్లు అర్జున్( Allu Arjun ) వెళతాడు.అలాంటి సన్నివేశాలు చేయడానికి బాగా ఇమేజ్ ఉన్న ఏ హీరో కూడా ఒప్పుకోడు కానీ బన్నీ తన స్టేటస్ మొత్తం పక్కన పెట్టేసి మామూలు నటుడిగా నటించి వావ్ అనిపించాడు.నటుడు అన్న తర్వాత ఎలాంటి సన్నివేశంలోనైనా నటించాలని చెప్పకనే చెప్పాడు.
నిజానికి బన్నీ తప్ప పుష్ప పార్ట్-1 క్లైమాక్స్ లో వేరే హీరో నటించడానికి ధైర్యం చేయ లేడని చెప్పుకోవచ్చు.

ఇక మహేష్ బాబు( Mahesh Babu ) ఇటీవల వచ్చిన గుంటూరు కారం సినిమాలో లుంగీ కట్టి శ్రీ లీలతో బోల్డ్ స్టెప్పులు వేశాడు.సాధారణంగా ఈ హీరో చాలా క్లాస్ గా ఉంటాడు.మాస్ సినిమాల్లోనూ మంచిగా బట్టలు వేసుకొని కనిపిస్తాడు కానీ గుంటూరు కారం మూవీ( Guntur Kaaram )లో మాత్రం మొహమాటం పక్కన పెట్టేసి ఊర మాస్ లుక్‌లో కనిపించాడు.
మహేష్ ఆ మూవీ కోసం అంత ధైర్యం చేయడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.