స్టార్స్ 12 సినిమాల రెమ్యునరేషన్ ప్రభాస్ సంపాదనకు సమానం.. గ్రేట్ అంటూ?

ప్రస్తుతం స్టార్ హీరో ప్రభాస్ సంపాదన ఏకంగా 600 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ తన సినిమాల ద్వారా ఈ స్థాయిలో సంపాదించడం గమనార్హం.

 Star Heroes 12 Movies Remuneration Equal To Prabhas Remuneration Details Here ,h-TeluguStop.com

ప్రభాస్ తన సంపాదించిన మొత్తాన్ని హోటల్స్ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.అయితే తెలుగులో ప్రస్తుతం ప్రభాస్ స్థాయిలో రెమ్యునరేషన్ల ద్వారా సంపాదిస్తున్న హీరో మరెవరూ లేరనే సంగతి తెలిసిందే.

ప్రభాస్ తో పాటు స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఇతర హీరోలు ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల నుంచి 60 కోట్ల రూపాయల రేంజ్ లో తీసుకుంటున్నారు.ఈ స్టార్ హీరోలు 12 సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్ ప్రస్తుతం ప్రభాస్ సంపాదిస్తున్న సంపాదనకు సమానం కావడం గమనార్హం.

సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాపైనా ఆ ప్రభావం ప్రభాస్ పై ఏ మాత్రం పడలేదంటే ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కారణమని చెప్పవచ్చు.

Telugu Adipurush, Baahubali, Prabhas, Japan, Pan India, Prabhas Assets, Radhe Sh

ప్రభాస్ కు జపాన్ లో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే సంగతి తెలిసిందే.ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ అవుతాయో చెప్పలేమని కామెంట్లు చేస్తున్నాయి.ఈశ్వర్ సినిమాతో హీరోగా కెరీర్ ను మొదలుపెట్టిన ప్రభాస్ బాహుబలి బాహుబలి2 సినిమాలతో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు.

ప్రభాస్ తో సినిమా అంటే నిర్మాతలు సైతం ఖర్చుకు వెనుకాడటం లేదు.

ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ లతో మరిన్ని విజయాలను సొంతం చేసుకొని రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తర్వాత ప్రాజెక్ట్ లతో ప్రభాస్ రేంజ్ మారుతుందని పాన్ వరల్డ్ స్టార్ గా ప్రభాస్ గుర్తింపును సొంతం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ లను ఇప్పట్లో ప్రకటించే ఛాన్స్ లేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube