కేజీఎఫ్ 2 మూవీకి యశ్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, యశ్ కాంబినేషన్ లో కేజీఎఫ్ సినిమా తెరకెక్కి ఓవర్ నైట్ లో యశ్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చిన సంగతి తెలిసిందే.కేజీఎఫ్ సినిమాకు ముందు యశ్ కొన్ని కన్నడ సినిమాల్లో నటించినా ఈ సినిమానే అతని సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లను కూడా తెచ్చిపెట్టింది.

 Star Hero Yash Remuneration For Kgf 2 Movie, Yash, Prashanth Neel, Kgf Chapter 2-TeluguStop.com

ప్రస్తుతం యశ్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా తెరకెక్కగా త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

ఈ నెల 7వ తేదీన కేజీఎఫ్ ఛాప్టర్ 2 టీజర్ రిలీజ్ కాగా ఆ టీజర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

కేజీఎఫ్ ఛాప్టర్ 1కు యశ్ 11 కోట్ల రూపాయల పారితోషికం తీసుకోగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 కోసం 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది.కన్నడ ఇండస్ట్రీలో హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ లో ఈ రెమ్యునరేషన్ హైయెస్ట్ అని తెలుస్తోంది.

యశ్ కేజీఎఫ్ 2 సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ శాండిల్ వుడ్ ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.

Telugu Crore Rupees, Kgf, Kgf Chapter, Pan India, Prashanth Neel, Yash-Movie

కేజీఎఫ్ 2 సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొనగా ఈ సినిమాకు 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రావచ్చని తెలుస్తోంది.కేజీఎఫ్ ఛాప్టర్ 1కు తెలుగులో 15 కోట్ల రూపాయల కలెక్షన్లు రాగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 బిజినెస్ మాత్రం 50 కోట్ల రూపాయల వరకు జరుగుతోందని తెలుస్తోంది.తెలుగులో ప్రభాస్ తరహాలో యశ్ కూడా పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.

కేజీఎఫ్ 2 సినిమా తరువాత యశ్ ఎలాంటి సినిమాలో హీరోగా నటిస్తాడో కూడా తెలియాల్సి ఉంది.అయితే కన్నడ ఇండస్ట్రీ వర్గాలు మాత్రం యశ్ ఇకపై కూడా పాన్ ఇండియా సినిమాల్లోనే నటిస్తాడని చెబుతున్నారు.

కేజీఎఫ్ 2 సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టైతే యశ్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఫిక్స్ అయిపోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube