ప్రభాస్ మూవీలో గెస్ట్ రోల్ లో స్టార్ హీరో.. ఎవరంటే..?  

star hero yash guest role in prabhas salar movie,radhashyam ,salar,yash opening,kgf,tollywood,bhahubali,prashanth neel,kgf 2, - Telugu Guest Role, Kgf Chapter 2, Prabhas Movie, Salar, Star Hero Yash

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.నిన్న ఈ సినిమా ఓపెనింగ్ జరిగింది.

TeluguStop.com - Star Hero Yash Guest Role In Prabhas Salar Movie

ప్రశాంత్ నీల్ కేవలం నాలుగు నెలల్లో సలార్ సినిమా పూర్తి చేస్తానని హామీ ఇవ్వడంతో ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్ లతో పోలిస్తే సలార్ సినిమాలో మొదట నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఈ సినిమా ఓపెనింగ్ కు శాండిల్ వుడ్ స్టార్ హీరో యశ్, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు.

యశ్ ఓపెనింగ్ కు రావడంతో సలార్ సినిమాలో యశ్ అతిథి పాత్ర పోషించే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ప్రశాంత్ నీల్, యశ్ కాంబినేషన్ లో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైన సంగతి తెలిసిందే.

TeluguStop.com - ప్రభాస్ మూవీలో గెస్ట్ రోల్ లో స్టార్ హీరో.. ఎవరంటే..-Gossips-Telugu Tollywood Photo Image

యశ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 తెరకెక్కగా వారం రోజుల క్రితం విడుదలైన టీజర్ 15 కోట్ల వ్యూస్ ను దక్కించుకుంది.వ్యూస్ విషయంలో కేజీఎఫ్ ఛాప్టర్ 2 కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుండటం గమనార్హం.

కేజీఎఫ్ 2 సినిమా ఎప్పుడు విడుదలైనా కలెక్షన్లపరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని యశ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.సలార్ సినిమాలో యశ్ అతిథి పాత్రలో నటిస్తే శాండిల్ వుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల్లో సైతం సలార్ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

మరి యశ్ నిజంగా నటిస్తాడో లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.ప్రశాంత్ నీల్ అతిథి పాత్రలో నటించమని కోరితే మాత్రం యశ్ నో చెప్పే అవకాశం లేదు.

బాహుబలి, బాహుబలి 2 సినిమాల ద్వారా భారీగా గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ప్రభాస్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను ఎక్కువగా ఎంచుకుంటూ సినిమాసినిమాకు క్రేజ్ మరింత పెరిగే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రభాస్ నటించిన రాధేశ్యామ్, సలార్ ఈ ఏడాది విడుదల కానున్నాయి.

.

#Guest Role #Salar #KGF Chapter 2 #Star Hero Yash

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు