కన్నతండ్రికి లీగల్ నోటీసులు పంపిన స్టార్ హీరో..?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది మాస్టర్ సినిమాతో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే.యావరేజ్ టాక్ తో మాస్టర్ భారీ కలెక్షన్లను సాధించి హీరో విజయ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

 Star Hero Vijay Sent Legal Notices To His Father, Kollywood, Hero Vijay, Father,-TeluguStop.com

అయితే విజయ్ తాజాగా తన తండ్రికి లీగల్ నోటీసులు పంపి వార్తల్లో నిలిచారు.లాయర్ కుమరేశన్ ద్వారా విజయ్ తన తండ్రి చంద్రశేఖర్ కు లీగల్ నోటీసులను పంపించారని సమాచారం.

విజయ్ పంపిన నోటీసులో 2020 సంవత్సరం జూన్ నెలలో అఖిల భారత దళపతి విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం పేరుతో విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఒక రాజకీయ పార్టీని స్థాపించారని.ఆ పార్టీని రిజిష్టర్డ్ చేసిన సమయంలో.

విజయ్ ఆ పార్టీకి తనకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారని.విజయ్ తన తండ్రి తీసుకునే చర్యలకు మద్దతు ప్రకటించలేదని పేర్కొన్నారు.

చంద్రశేఖర్ స్థాపించిన పార్టీలో విజయ్ యొక్క పేరును, ఫోటోను వాడకూడదని.నిబంధనలను ఉల్లంఘిస్తే లీగల్ గా చర్యలు తీసుకుంటామని విజయ్ తరపు న్యాయవాది నోటీసులో పేర్కొన్నారు.

Telugu Chandrasekhar, Vijay, Kamal Hassan, Rajnikanth-Movie

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే మార్కెట్ ను పెంచుకుంటూ సక్సెస్ లను సొంతం చేసుకుంటున్న విజయ్ తండ్రికి నోటీసులు పంపించడం చర్చనీయాంశంగా మారింది.తమిళనాడు రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ ఎన్నికల్లో విజయ్ కూడా ఎన్నికల బరిలో నిలుస్తాడని ప్రచారం జరగగా తాజాగా ఆయన ప్రకటనతో స్పష్టత వచ్చిందని చెప్పవచ్చు.

రజనీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు ప్రకటించగా కమల్ హాసన్ మాత్రం ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.

విజయ్ కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని ఆయన అభిమానులు భావిస్తుండగా విజయ్ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటాడని అర్థమవుతోంది.అయితే విజయ్ అభిమానులు మాత్రం విజయ్ సొంతంగా పార్టీ స్థాపిస్తాడని భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube