ఒకే ఒక్కడు సీక్వెల్‌ లో ఆ స్టార్ హీరో  

Star hero Vijay titled superhit movies, Tollywood, Kollywood, Director Shankar, vake vakadu movie, South cinema, Indian cinema - Telugu Director Shankar, Indian Cinema, Kollywood, South Cinema, Star Hero Vijay Titled Superhit Movies, Tollywood, Vake Vakadu Movie

సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్ భారీ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్ట అనే సంగతి అందరికి తెలిసిందే.ప్రస్తుతం ఈ దర్శకుడు దృష్టి తన గత సినిమాలు సీక్వెల్ పై పడింది.

 Star Hero Vijay Oke Okkadu Sequel

రోబో సీక్వెల్ తో రీసెంట్ గా వచ్చిన శంకర్ ప్రస్తుతం భారతీయుడు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు.ఇప్పటికీ ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే షూటింగ్ కూడా ప్రారంభించాడు.

అయితే లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది.భారీ తారాగణంతో మరో భారీ బడ్జెట్ మూవీగా ఈ సినిమాని శంకర్ ఆవిష్కరించబోతున్నారు.

ఒకే ఒక్కడు సీక్వెల్‌ లో ఆ స్టార్ హీరో-Movie-Telugu Tollywood Photo Image

లైకా ప్రొడక్షన్ ఈ సినిమాని నిర్మిస్తుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లేకపోవడంతో ఇంటికే పరిమితమైన ఈ దర్శకుడు తన మరో సూపర్ హిట్ సినిమా సీక్వెల్ కథ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

గతంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా వచ్చిన ఒకే ఒక్కడు సినిమా పొలిటికల్ నేపథ్యంలో అద్భుతమైన కథనంతో బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది.ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ అయింది.

ఈ సినిమా కథ పరంగా ప్రజెంట్ జనరేషన్ కూడా దగ్గరగా ఉండడంతో దీనికి సీక్వెల్ స్టోరీని శంకర్ సిద్ధం చేశాడు.లాక్ డౌన్ సమయంలో కథని తయారు చేసినట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా కోసం స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ని సంప్రదించినట్లు సమాచారం.ఆయన ఓకే అంటే భారతీయుడు సీక్వెల్ తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.

ఇలాంటి పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమాలు చేయడంలో విజయ్ కి మంచి గుర్తింపు ఉంది.మరి శంకర్ సిద్ధం చేసిన కథకి విజయ్ ఎంత వరకు ఒకే చెప్తాడు అనేది వేచి చూడాలి.

#Kollywood

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Star Hero Vijay Oke Okkadu Sequel Related Telugu News,Photos/Pics,Images..