క్రాక్ సినిమాను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశారా..?  

2017 సంవత్సరంలో రవితేజ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కి విడుదలైన రాజా ది గ్రేట్ సినిమా తరువాత రవితేజ హీరోగా నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు.టచ్ చేసి చూడు, నేల టికెట్, అమర్ అక్బర్ ఆంటోనీ, డిస్కో రాజా సినిమాలతో వరుసగా నాలుగు ఫ్లాపులు రవితేజ ఖాతాలో చేరాయి.

TeluguStop.com - Star Hero Victory Venkatesh Rejected Crack Movie

అయితే క్రాక్ సినిమాతో మళ్లీ రవితేజ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు.

ఈ నెల 9వ తేదీన క్రాక్ సినిమా విడుదల కాగా క్రిటిక్స్ నుంచి, ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.50 శాతం ఆక్యుపెన్సీతో ఈ సినిమాకు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తుండగా 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు లభించి ఉంటే మాత్రం మాస్ మహరాజ్ రవితేజ కొత్త రికార్డులు క్రియేట్ చేసేవారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.కాటమరాయుడు తరువాత శృతిహాసన్ ఈ సినిమాలో నటించగా శృతిహాసన్ కు కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.

TeluguStop.com - క్రాక్ సినిమాను ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేశారా..-Gossips-Telugu Tollywood Photo Image

రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్లు కాగా వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడో సినిమా క్రాక్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం గమనార్హం.అయితే ఈ సినిమా కథను గోపీచంద్ మలినేని మొదట వెంకటేష్ కు వినిపించారని అయితే వెంకటేష్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపించలేదనిఇండస్ట్రీవర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
.

ఆ తరువాత రవితేజకు గోపీచంద్ మలినేని కథ వినిపించడం, సినిమా పట్టాలెక్కడం జరిగిపోయాయి.రవితేజ అభిమానులు సైతం ఈ కథ రవితేజకే బాగా సూట్ అవుతుందని భావిస్తున్నారు.ఇప్పటికే రవితేజ సంక్రాంతి విన్నర్ అనిపించుకోగా రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.
.

#Raviteja

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు