ఆ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్న విక్టరీ వెంకటేష్.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ దృశ్యం2 సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.వరుసగా సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్న వెంకటేష్ ఆ సినిమాలతో పాజిటివ్ ఫలితాలను అందుకుంటున్నారు.

 Star Hero Victory Venkatesh Daggubati Leads Horse Racing Business Details, Venka-TeluguStop.com

అయితే ఈ హీరో కొత్త వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది.ఈ సీనియర్ హీరో హార్స్ రేసింగ్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం.

ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్3 సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన ఎఫ్3 రిలీజ్ కానుందని ప్రకటన వెలువడింది.వెంకటేష్ కు సొంతంగా థండర్ రైడ్ అనే గుర్రం ఉండగా అక్షయ్ కుమార్ అనే వ్యక్తి జాకీ ఆ గుర్రాన్ని రైడ్ చేస్తున్నారు.మలక్ పేట్ రేస్ క్లబ్ లో ఇటీవల ఆ గుర్రం విన్నర్ గా నిలిచిందని సమాచారం.

భవిష్యత్తులో ఈ బిజినెస్ లో మరింత ఎక్కువగా ఇన్వాల్వ్ కావాలని వెంకీ భావిస్తున్నారని బోగట్టా.

సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును తెలివిగా ఇన్వెస్ట్ చేస్తూ విక్టరీ వెంకటేష్ మంచి లాభాలను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు.

Telugu Drushyam, February, Horse, Thunder Horse, Venkatesh, Venkatesh Horst-Movi

ఎఫ్3 సినిమా కచ్చితంగా థియేటర్లలోనే రిలీజవుతుందని వెంకీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.ఎఫ్2 మూవీ థియేటర్లలో విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించింది.నిర్మాత దిల్ రాజుకు ఎఫ్2 సినిమా ద్వారా భారీ మొత్తంలో లాభాలు వచ్చాయి.

Telugu Drushyam, February, Horse, Thunder Horse, Venkatesh, Venkatesh Horst-Movi

ఎఫ్3 సినిమాలో వెంకీ రేచీకటితో బాధ పడే వ్యక్తిగా కనిపించనుండగా డబ్బు చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.ఎఫ్3 మూవీకి వెంకటేష్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది.ఈ సినిమాలో వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్నారు.

వరుణ్ తేజ్ ఈ సినిమాలో నత్తితో బాధపడే వ్యక్తిగా కనిపిస్తారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube