సినిమారంగంలో మన సక్సెస్ మాత్రమే కాదు, ఇతరుల ఫేల్యూర్ కూడా అందరికి గట్టిగా తెలిసేలా చేయాలి.అప్పుడే కదా, మనం ఎదుగుతున్నాం అని ఇతరులకి తెలిసేది.
ఇదే సూత్రాన్ని ఒక టాప్ హీరో నమ్ముతున్నట్లు తెలుస్తోంది.
విషయం ఏమిటంటే, ఒక అగ్రహీరో సినిమా ఆశించనంతగా ఆడలేదు.
ఆ సినిమా సాధించిన కలెక్షన్లు సునాయసంగా దాటేసింది మన హీరోగారి సినిమా.ఆ విషయాన్ని డప్పు కొట్టించాడు, ఆ అగ్రహీరో మీద నెగెటివ్ కథనాలు రాయించాడట.
అది జరిగిపోయింది.
ఇక మరో అగ్రహీరో సినిమా దారుణంగా విఫలమైంది.
ఇప్పుడు ఈ హీరో మీద కూడా నెగెటివ్ ప్రచారం మన హీరోగారు చేయిస్తున్నారట.తన పీఆర్ టీంని రంగంలోకి దింపి, తెలుగుతో పాటు జాతీయ మీడియాని కూడా చెప్పుచేతల్లో పెట్టుకోని, తన సినిమా కలెక్షన్లు పెంచి చెప్పడం, ఇతర హీరోల సినిమా కలెక్షన్లు తగ్గించి చెప్పడం లాంటివి చేస్తున్నాడని ఫిలింనగర్ ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.