మహేష్‌ బాబు గారు సారీ : కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర  

Star Hero Upendra Says Sorry To Mahesh Babu-hero Upendra,mahesh Babu,rejecting Role,sorry To Mahesh

మహేష్‌ బాబు, అనీల్‌ రావిపూడి ల కాంబినేషన్‌లో రూపొందబోతున్న చిత్రంకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ చిత్రాన్ని మే నెలలో ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం మహర్షి చిత్రం షూటింగ్‌లో ఉన్న మహేష్‌ బాబు మరో వైపు అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు సంబంధించిన నటీనటుల ఎంపిక విషయంలో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది...

మహేష్‌ బాబు గారు సారీ : కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర-Star Hero Upendra Says Sorry To Mahesh Babu

ఈ చిత్రంలోని కీలక పాత్ర కోసం కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్రను ఎంపిక చేయాలని దర్శకుడు అనీల్‌ భావించాడు. అందుకు మహేష్‌ కూడా ఒప్పుకున్నాడు.

తెలుగులో ఆమద్య సన్నాఫ్‌ సత్యమూర్తి చిత్రంలో నటించిన ఉపేంద్ర ఆతర్వాత పెద్దగా తెలుగుపై దృష్టి పెట్టలేదు.

దాంతో తప్పకుండా ఈ చిత్రంలో మహేష్‌బాబు కోసం ఉపేంద్ర నటిస్తాడని అనీల్‌ రావిపూడి భావించాడు. అయితే మహేష్‌ బాబుతో సినిమా అనగానే ఆనందం వ్యక్తం చేసిన ఉపేంద్ర డేట్ల విషయం వచ్చేప్పటికి కష్టం అంటూ తేల్చి చెప్పాడట. ఇప్పటికే కమిట్‌ అయిన సినిమాల కారణంగా మహేష్‌బాబు సినిమాలో చేయలేను అంటూ ఉపేంద్ర చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఉపేంద్ర నో చెప్పిన విషయంను అనీల్‌ రావిపూడి పెద్దగా బయటకు చెప్పలేదు. కాని తాజాగా ఉపేంద్ర ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తెలుగు దర్శకుడు మహేష్‌ సినిమాలో నటించాల్సిందిగా నన్ను కోరాడు. కాని నేను డేట్లు కుదరక పోవడంతో నటించలేక పోతున్నాను.

ఈ విషయంలో మహేష్‌ బాబు గారికి సారీ చెబుతున్నాను అంటూ ఉపేంద్ర తన వినమ్రతను చూపించాడు. కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర ఒక సింపుల్‌ మనిషిగా మహేష్‌కు సారీ చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.