చనిపోయే నాటికి సుశాంత్ ఆస్తుల విలువ ఎంతంటే..?

బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయి సరిగ్గా ఏడాది అవుతోంది.సుశాంత్ చనిపోవడానికి అసలు కారణం ఇప్పటికీ వెలుగులోకి రాలేదు.

 Bollywood Star Hero Sushant Singh Rajput Assets Details, 59 Crore Rupees, Assets-TeluguStop.com

సుశాంత్ మరణానికి అసలు కారణం తేల్చాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.నెటిజన్ల నుంచి సుశాంత్ మరణానికి సంబంధించి అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి.

స్టార్ హీరోగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే సుశాంత్ మృతి చెందడం గమనార్హం.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తన స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అవకాశాలను సంపాదించుకున్నారు.

చనిపోయే సమయానికి సుశాంత్ ఒక్కో సినిమాకు 7 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారు.సుశాంత్ చదువు విషయానికి వస్తే ఆయన ఇంజనీరింగ్ చదువుతుకున్నారు.ఖగోళ శాస్త్రంపై సుశాంత్ కు ఆసక్తి ఎక్కువగా ఉండేదని తెలుస్తోంది.

బైక్స్ అన్నా, ఖరీదైన మోటార్ వాహనాలు అన్నా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఎంతగానో ఇష్టపడతారు.

Telugu Crore Rupees, Assets, Chichchore, Fitoor, Susanth Offers, Susanth, Sushan

సుశాంత్ దగ్గర ఎన్నో విలాసవంతమైన కార్లు ఉండేవి.సుశాంత్ చనిపోయే నాటికి అతని ఆస్తుల విలువ ఏకంగా 59 కోట్ల రూపాయలుగా ఉంది.2013 సంవత్సరంలో కాయ్ పో చే పోరుతో సుశాంత్ తన సినీ కెరీర్ ను మొదలుపెట్టారు.గ్రూప్ డ్యాన్సర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన సుశాంత్ ఆ తరువాత టీవీ నటుడిగా పని చేశారు.

కొంతమంది బాలీవుడ్ ప్రముఖుల కుట్రల వల్లే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చనిపోయారని నెటిజన్లు భావిస్తున్నారు.

Telugu Crore Rupees, Assets, Chichchore, Fitoor, Susanth Offers, Susanth, Sushan

బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని ఆఫర్లు వచ్చినట్టే వచ్చి పోవడంతో సుశాంత్ మానసిక క్షోభ అనుభవించి చనిపోయినట్లు తెలుస్తోంది.బాజీరావు మస్తానీ సినిమాలో తొలుత ఆఫర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు రాగా కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో ఛాన్స్ మిస్ అయింది.ఆ తరువాత ఫితూర్ అనే సినిమాలో కూడా సుశాంత్ కు ఛాన్స్ మిస్ అయిందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube