ఉప్పెన రీమేక్ కోసం సిద్దమవుతున్న స్టార్ హీరోల కొడుకులు....  

star hero Sons Showing interest to Uppena movie Remake, Uppena movie Remake news, Sanjay, Tamil Upcomming hero, Vijay setupati, Sharukh Khan, Tollywood, Aryan khan - Telugu Aryan Khan, Sanjay, Sharukh Khan, Star Hero Sons Showing Interest To Uppena Movie Remake, Tamil Upcomming Hero, Tollywood, Uppena Movie Remake News, Vijay Setupati

తెలుగులో ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన “ఉప్పెన” చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్లను కొల్లగొడుతోంది.

TeluguStop.com - Star Hero Sons Showing Interest To Uppena Remake

కాగా ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నూతన నటీనటులు మెగా అల్లుడు వైష్ణవ్ తేజ్ మరియు యంగ్ హీరోయిన్ కృతి శెట్టి నటించారు. అలాగే ఈ చిత్రంలో తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించి తన పాత్రలతో ప్రేక్షకుల్ని కట్టి పడేసాడు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.

TeluguStop.com - ఉప్పెన రీమేక్ కోసం సిద్దమవుతున్న స్టార్ హీరోల కొడుకులు….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇంతకీ ఆ విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు నటుడు విజయ్ సేతుపతి సన్నాహాలు చేస్తున్నాడని ఇందులో భాగంగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన తమిళ డిజిటల్ రీమేక్ హక్కులను కూడా విజయ్ సేతుపతి కొనుక్కున్నట్టు సమాచారం.

 కాగా ఈ చిత్రంలో హీరోగా గా తమిళ్ తలైవా విజయ్ కొడుకు సంజయ్ విజయ్ హీరోగా నటిస్తున్నాడనీ టాక్ వినిపిస్తోంది.

అంతేకాక ఆమధ్య విజయ్ సేతుపతి సంజయ్ కోసమే ఉప్పెన డిజిటల్ హక్కులను కొన్నాడని కూడా వార్తలు వినిపించాయి.

కాగా ప్రస్తుతం సంజయ్ ఇతర దేశాల్లో నటనకు సంబంధించిన కోర్సులను అభ్యసిస్తున్నాడు. అయితే ఉప్పెన తెలుగు చిత్రంలో విలన్ పాత్ర పోషించిన విజయ్ సేతుపతి తమిళంలో కూడా విలన్ గా నటిస్తాడో లేక అతడి స్థానంలో మరో నటుడిని నటింపజెస్తాడో చూడాలి.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఉప్పెన చిత్రం టాలీవుడ్ లో మంచి విజయం సాధించడంతో ఈ చిత్రాన్ని బాలీవుడ్లో కూడా రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట.కాగా ఉప్పెన హిందీ రీమేక్ చిత్రంలో హీరోగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ నటించబోతున్నట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ వచ్చీరావడంతోనే నూతన దర్శకుడు బుచ్చిబాబు సాన అటు నూతన నటీనటులు వైష్ణవ తేజ్ మరియు కృతి శెట్టి లు మంచి విజయం సాధించి తమ ప్రస్థానాన్ని మొదలు పెట్టారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

#Vijay Setupati #Sanjay #Sharukh Khan #UppenaMovie #Aryan Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు