స్టార్ వారసుడు ప్రేమలో పడ్డాడా..?

కోలీవుడ్ స్టార్ హీరో వారసుడు ప్రేమలో పడ్డాడా.అతని మొదటి సినిమా హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకు తిరిగుతున్నాడని టాక్.

 Star Hero Son Fall In Love With First Movie Heroine, Kollywood , Tollywood , Dru-TeluguStop.com

ఇంతకీ ప్రేమలో పడ్డ ఆ స్టార్ తనయుడు ఎవరు అంటే.తమిళ స్టార్ చియాన్ విక్రం తనయుడు ధృవ్ అని తెలుస్తుంది.

తమిళంలో అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసి వర్మ గా మొదట చేసిన ధృవ్ ఆ సినిమాతో అక్కడ మంచి మార్కులు కొట్టేశాడు.స్టార్ తనయుడిగా ధృవ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.

అయితే ఆ సినిమా హీరోయిన్ తో సినిమా తర్వాత కూడా ఫ్రెండ్ షిప్ చేస్తున్నాడని టాక్.అర్జున్ రెడ్డి రీమేక్ గా వచ్చిన ఆదిత్య వర్మ సినిమాలో ధృవ్ హీరోయిన్ బనితా సంధు తో రొమాన్స్ చేశాడు.

కథలో భాగంగా ఇద్దరి మధ్య ఘాటు సీన్స్ పెట్టారు.ఈ క్రమంలో వారిద్దరు నిజంగానే ప్రేమలో పడ్డారని టాక్.ధృవ్ బనితాల మధ్య సంథింగ్ సంథింగ్ అని వార్తలు వస్తున్నాయి.భారత సంతతికి చెందిన బ్రిటన్ బ్యూటీ బనితా సంధు.

ఆదిత్య వర్మ కోసం చెన్నై వచ్చిన ఈ చిన్నది ధృవ్ తో నిజంగానే ప్రేమలో పడ్డదని టాక్.ఇద్దరు అడపాదడపా కలుస్తూ మీడియా కంటికి చిక్కుతున్నారట.

మరి స్టార్ వారసుడి ప్రేమాయణం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube