ఆ ఘటనతో మందు మానేశా.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్!

సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా మందు వ్యసనానికి బానిసలవుతుంటారు.ఇక సెలబ్రిటీలలో కొందరు కొంత మోతాదులో మద్యం సేవిస్తే.

 Star Hero Shimbu Shocking Comments With That Incident-TeluguStop.com

మరికొంతమంది మోతాదుకు మించి సేవించి కెరీర్ ను నాశనం చేసుకుంటారు.అంతేకాకుండా డ్రగ్స్ కు కూడా బాగా అలవాటు పడుతుంటారు.

కానీ అందులో నుంచి తేరుకోవడం మాత్రం చాలా వరకు తక్కువనే చెప్పవచ్చు.కానీ ఓ స్టార్ హీరో మాత్రం తనకు అలవాటు ఉన్న మందును ఒక్క ఘటనతో మానేశాడట.

 Star Hero Shimbu Shocking Comments With That Incident-ఆ ఘటనతో మందు మానేశా.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతకీ ఆ హీరో ఎవరంటే.

కోలీవుడ్ స్టార్ హీరో శింబు.

ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోగా నిలిచాడు.తన నటనతో విపరీతమైన అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు.

ఇక ప్రస్తుతం మరో సినిమా లో బిజీగా ఉన్నాడు శింబు.డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు‘ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది.ఇందులో కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటిస్తుంది.

Telugu Alcohol, Director Venkat Prabhu, Kalyani Priyadarshi, Kollywood, Maanaadu Movie, Quit, Shimbu Alcohol, Simbu, Sj. Surya-Movie

ఇక గతంలో ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది.ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పాటను ఈ సినీ బృందం ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.ఇందులో హీరో శింబు, డైరెక్టర్ వెంకట్ ప్రభు, హీరోయిన్ కళ్యాణి తో పాటు పలువురు లైవ్ లో పాల్గొన్నారు.ఇక నటుడు ఎస్ జే సూర్య.శింబు ను ఆల్కహాల్ మానేసినట్లు ప్రశ్నించగా వెంటనే శింబు మానేసినట్లు తెలిపాడు.

Telugu Alcohol, Director Venkat Prabhu, Kalyani Priyadarshi, Kollywood, Maanaadu Movie, Quit, Shimbu Alcohol, Simbu, Sj. Surya-Movie

తాను ఆల్కహాల్ మానేసి దాదాపు ఏడాది కావోస్తుందని తెలిపాడు.మద్యం తీసుకోవడం వల్ల కెరీర్ తో పాటు తన ఆరోగ్యం నాశనం అవుతుందన్న నేపథ్యంలో గత ఏడాది తను మద్యం మానేసానని తెలిపాడు.మద్యం మానేయడం వల్ల తను పూర్తిగా ఆరోగ్యంగా, యాక్టివ్ గా ఉన్నానని తెలిపాడు.

అంతే కాకుండా ప్రస్తుతం తన దృష్టి మొత్తం ఆరోగ్యం మరియు ఫిట్ నెస్ విషయంపైనే ఎక్కువగా ఉందని తెలిపాడు.ప్రస్తుతం శింబు మద్యం మానేసినట్లు బయటపెట్టడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

#DirectorVenkat #Shimbu Alcohol #Alcohol #Simbu #SJ. Surya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు