క్రాక్ మూవీకి రవితేజ రెమ్యునరేషన్ ఎంతంటే..?  

star hero raviteja remuneration for crack movie, krack movie, nizam ceded rights, ravi teja remunaration , star hero - Telugu Krack Movie, Nizam Ceded Rights, Raviteja Remuneration, Star Hero

టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కిన క్రాక్ సినిమా ఈ నెల 9వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.

TeluguStop.com - Star Hero Raviteja Remuneration For Crack Movie

సాధారణంగా రవితేజ ఒక సినిమాకు 10 కోట్ల నుంచి 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు.అయితే క్రాక్ సినిమాకు మాత్రం ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని తెలుస్తోంది.

కరోనా విజృంభణ, లాక్ డౌన్ వివిధ కారణాల వల్ల మారిన పరిస్థితుల నేపథ్యంలో రవితేజ రెమ్యునరేషన్ కు బదులుగా ఈ సినిమాకు నైజాం, వైజాగ్ హక్కులను తీసుకున్నారని సమాచారం.ఈ ఏడాది తొలి పెద్ద సినిమాగా క్రాక్ విడుదల కాగా నైజాం, వైజాగ్ ఏరియాల నుంచి పది కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

TeluguStop.com - క్రాక్ మూవీకి రవితేజ రెమ్యునరేషన్ ఎంతంటే..-Gossips-Telugu Tollywood Photo Image

రవితేజ హక్కులు తీసుకోవడం వల్ల నిర్మాతకు సినిమా విడుదలకు ముందు వడ్డీలు మిగిలాయి.

Telugu Krack Movie, Nizam Ceded Rights, Raviteja Remuneration, Star Hero-Latest News - Telugu

సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఫుల్ రన్ లో సాధారణంగా రవితేజ తీసుకునే మొత్తం కలెక్షన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.ఇప్పటికే పలువురు హీరోలు రెమ్యునరేషన్ తో పాటు హక్కులు తీసుకుంటూ ఉండగా రవితేజ మాత్రం నిర్మాత నుంచి రెమ్యునరేషన్ రూపంలో ఒక్క రూపాయి తీసుకోకపోవడం గమనార్హం.భవిష్యత్తులో ఇతర హీరోలు కూడా రెమ్యునరేషన్ విషయంలో రవితేజను ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి.

క్రాక్ సినిమా హిట్ కావడంతో రవితేజతో పాటు ఈ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని, హీరోయిన్ శృతిహాసన్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కు కూడా మంచి పేరు వచ్చింది.సంక్రాంతి పండుగకు రెడ్, మాస్టర్, అల్లుడు అదుర్స్ సినిమాలు కూడా విడుదల కాగా రెడ్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

ఇప్పటికే క్రాక్ బ్రేక్ ఈవెన్ కాగా రెడ్ మూవీ కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

#Star Hero

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు