పది రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

పది రూపాయిల కోసం నటించాడా? ఎవరు ఆ స్టార్ హీరో.అయినా పది రూపాయిల కోసం నటించడం ఏంటి అని ఆశ్చర్యం వెయ్యొచ్చు.

 10 Rupees Remuneration, Ravi Teja, First Film Money, Chennai, Gunashekar,-TeluguStop.com

కానీ నిజంగానే పది రూపాయిల కోసం ఓ స్టార్ హీరో నటించాడు.అయితే ఇక్కడ నిజమేమిటంటే.

ఆ స్టార్ హీరో విలన్ అయినా తర్వాత పది రూపాయిలు రెమ్యూనరేషన్ తీసుకోలేదు.స్టార్ హీరోకాకముందు కేవలం పది రూపాయల రెమ్యూనరేషన్ తో సినీ కెరీర్ ప్రారంభించాడు.

అతను ఎవరో కాదు రవి తేజ.

మాస్ మహారాజ్ రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ప్రతి సినిమాలోనూ ఎంతో ఎనర్జిటిక్ గా నటిస్తూ కామెడీ చేస్తూ అందరి మనసును దోచేసుకున్నాడు.కామెడీకి కామెడీ.సీరియస్ కి సీరియస్, ఎమోషనల్ సీన్స్ కి ఎమోషనల్ ఇలా అన్ని విధాలుగా తన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.మాస్ మహా రాజ్ గా పేరు సంపాదించుకొని కెరీర్ ప్రారంభంలో ఎన్నో కష్టాలు పడ్డాడు.1968లో పుట్టిన రవితేజ 1988 వరకు ఖాళీగా ఉండేవాడు.

Telugu Rupees, Chennai, Gunashekar, Ravi Teja-Movie

1988లో హీరో అవ్వాలనే ఉద్ద్యేశంతో చైన్నైకి వెళ్లి తిరిగాడు.ఆ సమయంలోనే గుణశేఖర్ , వైవిఎస్ చౌదరి పరిచయమై వారితో రూమ్ లో ఉండేవాడు.ఇంటి దగ్గర నుంచి తెచ్చిన డబ్బు అయిపోవడంతో జూనియర్ ఆర్టిస్ట్ గా రోజుకు 10 రూపాయిల రెమ్యునరేషన్ తో పని చేశాడు.

ఆతర్వాత చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ.జూనియర్ ఆర్టిస్ట్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యి కొన్ని సినిమాలకు ‘అప్రెంటిస్’గా వర్క్ చేసాడు.అలా చేసిన వ్యక్తి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగాడు.ఇప్పుడు కోట్లల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్నాడు.

ఏదైనా చెయ్యాలి అవ్వాలి అనుకున్నప్పుడు ఆ రేంజ్ లో కష్టాలు కచ్చితంగా వస్తాయ్.ఆ కష్టాలను అదిగమించినవాడే చివరికి రవి తేజాలా హీరో అవ్వగలడు.

మరి మీరు ఏం అంటారు?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube