రవితేజ సినిమాకు కోర్టు కష్టాలు.. రిలీజ్ వాయిదా..?

ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా వరుస విజయాలతో బిజీగా ఉన్న రవితేజ ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.రవితేజ, శృతిహాసన్ జంటగా నటించిన క్రాక్ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా సాధారణ పరిస్థితులు ఏర్పడితే ఈ సినిమాను విడుదల చేద్దామని నిర్మాతలు భావిస్తున్నారు.

 Star Hero Raviteja Crack Movie In Legal In Legal Troubles, Crack Movie Release D-TeluguStop.com

అయితే ఈ సినిమాను కోర్టు కష్టాలు చుట్టుముట్టాయని సమాచారం.అందువల్ల ఇప్పట్లో ఈ సినిమా విడుదల కావడం కష్టమేననే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రవితేజ నటించిన డాన్ శీను, బలుపు సినిమాలకు దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేని ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.ఒక తమిళ డిస్ట్రిబ్యూషన్ సంస్థ క్రాక్ సినిమా విషయంలో కోర్టును ఆశ్రయించింది.

డిస్ట్రిబ్యూటర్ పిటిషన్ లో సినిమా రిలీజ్ పై స్టే ఇవ్వాలని కోరినట్లు సమాచారం.క్రాక్ సినిమా నిర్మాత ఠాగూర్ మధు విశాల్ తో గతంలో అయోగ్య అనే సినిమాను తెరకెక్కించారు.

Telugu Ayogya, Crack, Problems, Raviteja-Movie

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన టెంపర్ సినిమా రీమేక్ తమిళంలో ఆయోగ్యగా తెరకెక్కింది.అయితే తెలుగులో టెంపర్ బ్లాక్ బస్టర్ హిట్ కాగా తమిళంలో ఆయోగ్య మాత్రం డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది.అయితే ఆ సినిమా కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ స్క్రీన్ సీన్ మీడియా న్యాయపోరాటానికి సిద్ధమైంది.డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు చెల్లించిన తరువాతే క్రాక్ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరింది.

డిస్ట్రిబ్యూషన్ సంస్థ స్టే పిటిషన్ వేయడంతో ఇప్పట్లో సినిమా కావడం కష్టమే అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నిర్మాత డబ్బులు చెల్లిస్తే మాత్రమే సమస్య పరిష్కారమవుతుంది.

ప్రస్తుతం క్రాక్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.అయితే ఈ సినిమా విడుదలవుతుందో లేదో చూడాల్సి ఉంది.

లీగల్ సమస్యల్లో చిక్కుకోవడం ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్ విక్రయాల్లో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube