బతుకమ్మ వేడుకల్లో చరణ్ డ్యాన్స్.. వీడియో వైరల్..!  

Star Hero ram charan video goes viral in social media, Ram Charan, Upasana, Throw back video, RRR Movie, Bathukamma Dace, Ram Charan bathukamma dance - Telugu Bathukamma Dace, Ram Charan, Ram Charan Bathukamma Dance, Rrr Movie, Star Hero Ram Charan Video Goes Viral In Social Media, Throw Back Video, Upasana

మెగాస్టార్ తనయుడు, టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ మంచి డ్యాన్సర్ అనే సంగతి మనందరికీ తెలిసిందే.చరణ్ డ్యాన్స్ కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

TeluguStop.com - Star Hero Ram Charan Video Viral

ఇండస్ట్రీలోకి మెగాస్టార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినా మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అందరి ఆదరాభిమానులను రామ్ చరణ్ సొంతం చేసుకుంటున్నారు.రంగస్థలం సినిమా ద్వారా ప్రయోగాత్మక పాత్రలతోనూ సక్సెస్ సొంతం చేసుకుని రామ్ చరణ్ సత్తా చాటుతున్నారు.

ప్రస్తుతం మగధీర లాంటి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా ఇప్పటికే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

TeluguStop.com - బతుకమ్మ వేడుకల్లో చరణ్ డ్యాన్స్.. వీడియో వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా రామ్ చరణ్ బతుకమ్మ వేడుకల్లో డ్యాన్స్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.

ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ అయిన ఈ వీడియో రామ్ చరణ్ అత్తవారింటికి రామ్ చరణ్ వెళ్లిన సమయంలో తీసినదని తెలుస్తోంది.ఈ వీడియోకు వేల సంఖ్యలో లైకులు రాగా రామ్ చరణ్ అభిమానులు సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తున్నారు.

మరోవైపు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు మెగాస్టార్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కూడా నటిస్తున్నారు.

ఈ సినిమా తరువాత రామ్ చరణ్ ఎవరి దర్శకత్వంలో నటిస్తారో తెలియాల్సి ఉంది.

పలువురు స్టార్ డైరెక్టర్లతో రామ్ చరణ్ చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది.త్వరలోనే రామ్ చరణ్ కొత్త సినిమాలకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.

స్టార్ డైరెక్టర్లు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది.

#Upasana #StarHero #Bathukamma Dace #Ram Charan #RamCharan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Star Hero Ram Charan Video Viral Related Telugu News,Photos/Pics,Images..