ఉపాసనను చరణ్ ఫస్ట్ టైమ్ ఎక్కడ కలిశారో తెలుసా..?

స్టార్ హీరో రామ్ చరణ్ ఉపాసన వివాహం జరిగి 9 సంవత్సరాలైంది.టాలీవుడ్ లోని క్యూట్ కపుల్స్ లో ఉపాసన రామ్ చరణ్ జంట కూడా ఒకటనే సంగతి తెలిసిందే.

 Star Hero Ram Charan Upasana First Meeting Details Here-TeluguStop.com

చిరంజీవి తనయుడిగా చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తన సినీ కెరీర్ లో ఎన్నో ఘన విజయాలను సొంతం చేసుకున్నారు.ఆ సినిమా తరువాత మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను రామ్ చరణ్ సొంతం చేసుకున్నారు.

మరోవైపు ఉపాసన అపోలో కంపెనీలకు వైస్ ఛైర్మన్ గా పని చేశారు.చరణ్ ఉపాసన ఒకరినొకరు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.

 Star Hero Ram Charan Upasana First Meeting Details Here-ఉపాసనను చరణ్ ఫస్ట్ టైమ్ ఎక్కడ కలిశారో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాదాపు ఐదు సంవత్సరాలు చరణ్ ఉపాసన ప్రేమించుకోవడం గమనార్హం.మొదట చరణ్ ఉపాసనను స్పోర్ట్స్ క్లబ్ మీటింగ్ లో కలిశారు.

ఆ తరువాత ఒకరిపై మరొకరికి ఇష్టం కలగడంతో చరణ్ ఉపాసన పలుమార్లు కలుసుకోవడం గమనార్హం.

అయితే చరణ్ ఉపాసన ప్రేమలో ఉన్న సమయంలో ఆ విషయం వీళ్ల కామన్ స్నేహితులకు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారు.కొన్నిసార్లు ఉపాసన చరణ్ సరదాగా గొడవలు పడగా ఆ గొడవల వల్లే వాళ్ల మధ్య బంధం మరింత పెరిగింది.పెళ్లి తర్వాత కూడా అపోలోకు వైస్ ఛైర్మన్ గా కొనసాగుతున్న ఉపాసన కామినేని ప్రజలలో చైతన్యం కలిగించడానికి ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ ఉండటం గమనార్హం.

ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మాతగా ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు చరణ్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిసున్నట్టు ప్రకటన వెలువడింది.ఈ సినిమాలతో పాటు ఆచార్య సినిమాలో చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.చిరంజీవి, చరణ్ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్స్ లో నటిస్తుండటం గమనార్హం.

#FirstMeeting #Ram Charan #UpasanaRam #StarHero #Upasana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు