కళాతపస్వి కె.విశ్వనాథ్ పాదాలను తాకిన రామ్ చరణ్.. ఏం జరిగిందంటే?

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ చేతినిండా సినిమా ఆఫర్లు ఉన్నాయనే సంగతి తెలిసిందే.రాజమౌళి డైరెక్షన్ లో ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసిన రామ్ చరణ్, ఆచార్య సినిమా షూటింగ్ ను కూడా దాదాపుగా పూర్తి చేశారు.

 Star Hero Ram Charan Taking Blesses Of Legendary Director K Vishwanath-TeluguStop.com

నటుడిగా తన స్థాయికి పెంచే పాత్రలను రామ్ చరణ్ ఎంపిక చేసుకుంటూ ఉండటం గమనార్హం.ఇప్పటికే శంకర్ చరణ్ కాంబో మూవీ షూటింగ్ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.

అయితే చరణ్ బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.దర్శకుడిగా, నటుడిగా కె.విశ్వనాథ్ పేరుప్రఖ్యాతలను సంపాదించుకున్న సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో కె.విశ్వనాథ్ పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.అయితే కె.విశ్వనాథ్, చరణ్ తాజాగా సువర్ణభూమి యాడ్ లో కలిసి నటించారు.యాడ్ లో భాగంగా చరణ్ కె.విశ్వనాథ్ పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.

 Star Hero Ram Charan Taking Blesses Of Legendary Director K Vishwanath-కళాతపస్వి కె.విశ్వనాథ్ పాదాలను తాకిన రామ్ చరణ్.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యాడ్ లో రామ్ చరణ్ ఫిట్ గా ఉండాలని ఫిజికల్ గానే కాకుండా ఫైనాన్షియల్ గా ఫిట్ గా ఉండాలని త్వరగా డెవలప్ అయిన వాళ్లంతా సరైన ప్లేస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్లే అయ్యారని రామ్ చరణ్ యాడ్ లో చెప్పుకొచ్చారు.చరణ్ కు ఈ యాడ్ లో నటించినందుకు భారీ మొత్తంలో పారితోషికం దక్కింది.విశ్వనాథ్ తో కలిసి నటించడంతో చాలా సంతోషంగా ఉందని రామ్ చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది.

మరోవైపు శంకర్ సినిమాలో చరణ్ పాత్రకు సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఏ వార్త నిజమో ఏ వార్త అబద్ధమో చాలామంది అభిమానులకు అర్థం కావడం లేదు.త్వరలో శంకర్ చరణ్ పాత్రకు సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.శంకర్ చరణ్ కాంబో మూవీ టీజర్ తో చరణ్ పాత్రకు సంబంధించిన క్లారిటీ రానుంది.

#Legendary #Vishwanath #CharanSuvarna #Ram Charan #Blesses

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు