భార్యపై చరణ్ షాకింగ్ కామెంట్స్.. ఏది ఇచ్చినా తక్కువేనంటూ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్యూట్ కపుల్స్ లో చరణ్ ఉపాసన జోడీ ఒకటనే సంగతి తెలిసిందే.రామ్ చరణ్ భార్య ఉపాసన ఒకవైపు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూనే మరోవైపు అపోలో హెల్త్ కేర్ సంస్థల బాధ్యతలు చూసుకుంటున్న సంగతి తెలిసిందే.

 Star Hero Ram Charan Shocking Comments About Upasana-TeluguStop.com

నేడు ఉపాసన పుట్టినరోజు.ఉపాసన బర్త్ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా చరణ్ భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

భార్యకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా తక్కువేనని చరణ్ షాకింగ్ కామెంట్లు చేశారు.

 Star Hero Ram Charan Shocking Comments About Upasana-భార్యపై చరణ్ షాకింగ్ కామెంట్స్.. ఏది ఇచ్చినా తక్కువేనంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చరణ్ అర్ధాంగి కావడంతో ఉపాసన కొణిదెలకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

చరణ్ ఉపాసన పేదల కొరకు, ఫ్యామిలీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని వెల్లడించారు.ఉపాసనకు కృతజ్ఞత చెప్పడం కొరకు ఏ గిఫ్ట్ ఇచ్చినా తక్కువేనని చరణ్ చెప్పుకొచ్చారు.

భార్యపై రామ్ చరణ్ తన ప్రేమను వ్యక్తం చేసిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చరణ్ ఎమోజీలను షేర్ చేశారు.

చరణ్ షేర్ చేసిన కేక్, హార్ట్ ఎమోజీలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.2012 సంవత్సరం జూన్ నెల 14వ తేదీన చరణ్, ఉపాసనల వివాహం ఘనంగా జరిగింది.నిత్యం ఉపాసన తను చేస్తున్న మంచి పనుల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.మెగాబ్రదర్ నాగబాబు సైతం ఉపాసనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.కొన్ని రోజుల క్రితం సేంద్రీయ వ్యవసాయం చేసి ఉపాసన వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

చరణ్ హెల్త్ విషయంలో కూడా ఉపాసన స్పెషల్ కేర్ తీసుకుంటారని తెలుస్తోంది.పలువురు టాలీవుడ్ హీరోయిన్ల డైట్స్ కు సంబంధించి ఉపాసన ఇంటర్వ్యూలు చేసిన సంగతి తెలిసిందే.చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.

#AppolloHealth #Ramcharan #Upasana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు