వివాదంలో చిక్కుకున్న చరణ్ బర్త్ డే సీడీపీ.. ఏమైందంటే ..?

రేపు స్టార్ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే.చరణ్ పుట్టినరోజు కావడంతో రాజమౌళి డైరెక్షన్ లో చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఒక అప్ డేట్ రానుందని తెలుస్తోంది.

 Hero Ram Charan Fans Fire On Common Display Pictures Of His Birthday , Ram Chara-TeluguStop.com

ఆచార్య సినిమాకు సంబంధించి, చరణ్ శంకర్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా వచ్చే అవకాశాలు ఐతే ఉన్నాయని తెలుస్తోంది.స్టార్ హీరోల బర్త్ డే అంటే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే హడావిడి అంతాఇంతా కాదు.

ఈ మధ్య కాలంలో ఫ్యాన్స్ కామన్ డీపీ అనే ట్రెండ్ ను కూడా ప్రారంభించగా స్టార్ హీరో పుట్టినరోజు సందర్భంగా ఒక కామన్ పోస్టర్ విడుదలవుతుంది.హీరోల ఫ్యాన్స్ ఆ పోస్టర్ ను వాట్సాప్ లో, ఇతర సోషల్ మీడియా ఖాతాలలో డీపీలుగా పెట్టుకుంటున్నారు.

అయితే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక కామన్ డీప్ విడుదల కాగా ఆ డీపీ చాలా కామన్ గా ఉండటంతో మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

Telugu Acharya, Commondisplay, Fans, Ram Charan, Ram Charan Cdp, Rrr-Movie

కొంతమంది సెలబ్రిటీలు సీడీపీ బాగుందని చెబుతున్నా రామ్ చరణ్ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర అసహనానికి లోనవుతున్నారు.సీడీపీ ఏ మాత్రం ఆకట్టుకునేలా లేదని ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ప్రస్తావన లేకుండా సీడీపీ ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మెగా ఫ్యాన్స్ ఎడిట్ చేసిన పోస్టర్లు ఈ సీడీపీతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయని ఈ సీడీపీ వల్ల తాము హర్ట్ అయ్యామని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతూ ఉండటం గమనార్హం.

సీడీపీ వివాదం పట్ల రామ్ చరణ్ స్పందిస్తారేమో చూడాల్సి ఉంది.చరణ్ పుట్టినరోజుకు మరికొన్ని గంటల సమయం ఉన్న నేపథ్యంలో కొత్త సీడీపీని రిలీజ్ చేస్తారేమో చూడాల్సి ఉంది.

మొత్తానికి సీడీపీ వివాదం ఫ్యాన్స్ ను ఎంతో టెన్షన్ పెడుతోందని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube