రామ్ చరణ్ కారు డ్రైవర్ జీతం ఎంతో తెలుసా..?

స్టార్ హీరో రామ్ చరణ్ మెగాస్టార్ కొడుకైనప్పటికీ, సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో ఒకరు అయినప్పటికీ ఆ గర్వాన్ని ప్రదర్శించకుండా ఎంత ఎదిగినా ఒదిగే ఉండటంతో పాటు నటుడిగా తన స్థాయిని పెంచే సినిమాలలో ఎక్కువగా నటిస్తుండటం గమనార్హం.ప్రస్తుతం ఆచార్య, రౌద్రం రణం రుధిరం సినిమాల్లో నటిస్తున్న రామ్ చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమాకు కమిటయ్యారు.

 Star Hero Ram Charan Car Driver Salary Details Here, 90000 Rupees, Car Driver, R-TeluguStop.com

రామ్ చరణ్ సినిమాలను ఎంపిక చేసుకుంటున్న విధానాన్ని ఆయన ఫ్యాన్స్ సైతం మెచ్చుకుంటున్నారు.రామ్ చరణ్ తన కారు డ్రైవర్ కు సైతం భారీగా వేతనం ఇస్తుండటం గమనార్హం.

రామ్ చరణ్ కారు డ్రైవర్ జీతం 45 వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఉంటుందని తెలుస్తోంది.సాఫ్ట్ వేర్ ఉద్యోగి రేంజ్ లో రామ్ చరణ్ తన కారు డ్రైవర్ కు వేతనం ఇస్తుండటం గమనార్హం.

తన దగ్గర పని చేసే ఉద్యోగులను చరణ్ గౌరవించడంతో పాటు ఉద్యోగులకు సంబంధించిన బాధ్యత కూడా తమదే అని చరణ్ భావిస్తారని సమాచారం.

కరోనా వల్ల ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోయినా సెలబ్రిటీల దగ్గర పని చేసే వాళ్లకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగలేదు.

రామ్ చరణ్ తన దగ్గర పని చేసే సిబ్బందికి మంచి వేతనం చెల్లించడంతో పాటు బోనస్, ఇతర సౌకర్యాలను కల్పిస్తారని తెలుస్తోంది.మరోవైపు చరణ్ నటిస్తున్న సినిమాల షూటింగ్ లు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఒకే ఏడాదిలో తక్కువ గ్యాప్ లో చరణ్ నటించిన రెండు సినిమాలు రిలీజ్ కానున్నాయి.

Telugu Rupees, Car, Ram Charan, Salary-Movie

ఈ రెండు సినిమాల షూటింగ్ లు పూర్తయ్యాక ఎక్కువ రోజులు బ్రేక్ తీసుకోకుండానే చరణ్ శంకర్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.రాజమౌళి సినిమాతో పాన్ ఇండియా హీరోగా వచ్చే గుర్తింపుతో కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకోవాలని రామ్ చరణ్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube