స్టార్ హీరో ప్రభాస్ ఖాతాలో అరుదైన ఘనత.. కల్కి మూవీ అక్కడ ప్రదర్శితం కానుందా?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు( Prabhas ) ఏ రేంజ్ లో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రభాస్ నటించి ఈ ఏడాది విడుదలైన కల్కి 2898 ఏడీ సినిమా( Kalki 2898 AD ) బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా విడుదలకు ముందు విడుదల తర్వాత ఎన్నో అరుదైన ఘనతలను సొంతం చేసుకుంది.అయితే తాజాగా ఈ సినిమా ఖాతాలో మరో అరుదైన ఘనత చేరడం గమనార్హం.

29వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్( 29th Busan International Film Festival ) జరగనుండగా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ సినిమా ప్రదర్శితం కానుంది.ఈ ఏడాది జూన్ నెలలో విడుదలైన కల్కి మూవీ ఫ్యాన్స్ ను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది.ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి.

సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా అభిమానులకు మాత్రం ఎంతగానో నచ్చేసిందనే చెప్పాలి.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

Advertisement

కల్కి మూవీ భవిష్యత్తులో రికార్డుల విషయంలో సైతం సంచలనాలు సృష్టిస్తుందని అభిమానులు ఫీలవుతున్నారు.అక్టోబర్ నెల 2 నుంచి అక్టోబర్ 11 వరకు ఫిల్మ్ ఫెస్టివల్ జరగనుండగా బీ.ఐ.ఎస్.ఎఫ్ లో ఉన్న అతిపెద్ద బహిరంగ థియేటర్ లో కల్కి మూవీని అక్టోబర్ 8, 9 తేదీలలో ప్రదర్శించనున్నారని సమాచారం అందుతోంది.కల్కి సీక్వెల్ పై కూడా అంచనాలు పెరుగుతున్నాయి.

కల్కి మూవీ సీక్వెల్( Kalki Sequel ) ఒకింత భారీ రేంజ్ లో ఉండనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కల్కి సీక్వెల్ కలెక్షన్ల విషయంలో సైతం సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ప్రభాస్ కెరీర్ లో బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత ఆ రేంజ్ హిట్ అంటే కల్కి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.

పుష్ప2 లో బన్నీ ధరించిన దుస్తుల వెనుక అసలు కథ ఇదే.. అక్కడే కొనుగోలు చేశారా?
Advertisement

తాజా వార్తలు