శర్వానంద్ పెళ్లికి స్టార్ హీరో ప్రభాస్ అడ్డు.. అసలేమైందంటే..?

ఈ మధ్య కాలంలో వరుస ఫ్లాపుల వల్ల ఇబ్బంది పడుతూ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోలలో శర్వానంద్ ఒకరు.శర్వానంద్ హీరోగా నటించి ఈ ఏడాది విడుదలైన శ్రీకారం సినిమాకు మంచి టాక్ వచ్చినా ఆ సినిమాకు పోటీగా అదే రోజు రెండు సినిమాలు రిలీజ్ కావడం, జాతిరత్నాలు సినిమాకు హిట్ టాక్ రావడంతో శ్రీకారం సినిమా నిర్మాతలకు నష్టాలు వచ్చాయి.

 Star Hero Prabhas Create Problems For Sharwanand Marriage , Actress Swapnika,  C-TeluguStop.com

అయితే ఏళ్లు గడుస్తున్నా శర్వానంద్ ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు.

అయితే హీరో శర్వానంద్ పెళ్లికి ప్రభాస్ అడ్డు అని తెలుస్తోంది.

శర్వానంద్ ను కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోమని అడుగుతుంటే శర్వానంద్ మాత్రం ప్రభాస్ పెళ్లి చేసుకున్న తర్వాత చేసుకుంటానని చెబుతున్నట్టు సమాచారం.ప్రస్తుతం శర్వానంద్ వయస్సు 37 సంవత్సరాలు కాగా శర్వానంద్ పెళ్లికి సంబంధించిన శుభవార్తను ఎప్పుడు చెబుతారో చూడాల్సి ఉంది.

ప్రముఖ సినీ నటి స్వప్నిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

Telugu Mahesh, Prabhas, Sharwanandclose, Sharwanand-Movie

హీరోయిన్ ఫ్రెండ్ రోల్స్ లో ఎక్కువగా నటించిన స్వప్నిక డైరెక్షన్ డిపార్టుమెంట్ లో కూడా బిజీ కావాలని భావించి ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీకి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.మహేష్ బాబు సర్కారు వారి పాట సెట్ లో కూల్ గా, జోవియల్ గా, ఎనర్జీతో ఉంటారని స్వప్నిక అన్నారు.సర్కారు వారి పాట సెకండ్ షెడ్యూల్ కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని స్వప్నిక వెల్లడించారు.

Telugu Mahesh, Prabhas, Sharwanandclose, Sharwanand-Movie

టాలీవుడ్ హీరోలు శర్వానంద్, నాగశౌర్య తనకు మంచి స్నేహితులని స్వప్నిక చెప్పుకొచ్చారు.ప్రభాస్ పెళ్లి చేసుకుంటే అమ్మాయిలలో చాలామంది బాధ పడతారని స్వప్నిక చెప్పుకొచ్చారు.దర్శకురాలిగా గుర్తుండిపోయే సినిమాను చేయాలని తాను అనుకుంటున్నానని ఆ కోరికను ఎప్పటికైనా తీర్చుకుంటానని స్వప్నిక చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube