ఏపీ టికెట్ రేట్లపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో ప్రభాస్.. 50 శాతం అంటూ?

ఏపీలో అమలవుతున్న టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉన్నాయనే సంగతి తెలిసిందే.ఏపీ టికెట్ రేట్ల వల్ల పుష్ప, అఖండ లాంటి భారీ బడ్జెట్ సినిమాలు కలెక్షన్ల విషయంలో నష్ట పోయాయి.

 Star Hero Prabhas Comments About Ticket Rates Goes Viral, Prabhas , Ap Ticet Rat-TeluguStop.com

భీమ్లా నాయక్ సినిమాకు కూడా ఏపీ టికెట్ రేట్ల వల్ల కొంత మేర నష్టాలు తప్పవని తెలుస్తోంది.అయితే రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఏపీ టికెట్ రేట్ల గురించి స్పందించిన ప్రభాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

సినిమాలకు కమర్షియల్ గా ఆంధ్ర మార్కెట్ పెద్దదని ప్రభాస్ తెలిపారు.రాధేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాలను తెరకెక్కించిన సమయంలో టికెట్ రేట్లు తక్కువగా ఉంటే నిర్మాతలకు షాకేనని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

టికెట్ రేట్లను తగ్గించడం వల్ల 40 నుంచి 50 శాతం వరకు కలెక్షన్లు తగ్గుతాయని ప్రభాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఒక విధంగా ఇది భారీ నష్టమేనని ప్రభాస్ పేర్కొన్నారు.

Telugu Ap, Ap Ticet Rates, Prabhas, Project, Radhyashyam, Salar-Movie

గడిచిన ఏడు సంవత్సరాల కాలంలో తాను ఎక్కువ సినిమాలు చేయలేదని అందువల్ల ప్రస్తుతం ఏడాదికి రెండు సినిమాలు చేయాలని తాను భావిస్తున్నానని ప్రభాస్ చెప్పు కొచ్చారు.ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ ముఖ్యమైన సినిమాలు అని ప్రభాస్ కామెంట్లు చేశారు.రాబోయే మూడు సంవత్సరాలలో మరింత ఎక్కువ కష్టపడాలని తాను భావిస్తున్నానని ప్రభాస్ చెప్పుకొచ్చారు.

Telugu Ap, Ap Ticet Rates, Prabhas, Project, Radhyashyam, Salar-Movie

రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్ లను ప్రభాస్ ఇప్పటికే పూర్తి చేశారనే సంగతి తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, సలార్ సినిమాలతో బిజీగా ఉన్నారు.రాధేశ్యామ్ తో మరో సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ప్రభాస్ భావిస్తున్నారు.

ప్రభాస్ కెరీర్ లోని భారీ బడ్జెట్ సినిమాలలో రాధేశ్యామ్ ఒకటనే సంగతి తెలిసిందే.ప్రభాస్ కు ప్రేక్షకుల్లో క్రేజ్ కూడా అంత కంతకూ పెరుగుతోంది.

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలలో ప్రభాస్ ఎక్కువగా నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube