వకీల్ సాబ్ కు అసలైన అగ్నిపరీక్ష ఇదే..?

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా నిన్న విడుదలై తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.2021 సంవత్సరం జనవరిలో క్రాక్, ఫిబ్రవరిలో ఉప్పెన, మార్చిలో జాతిరత్నాలు విడుదలై హిట్ కాగా ఏప్రిల్ లో వకీల్ సాబ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.వకీల్ సాబ్ పెద్ద హీరో సినిమా, భారీ బడ్జెట్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.

 Star Hero Pawan Kalyan  Vakeel Saab Movie Box Office Prediction , Biggest Opener-TeluguStop.com

అయితే హిట్ టాక్ వచ్చినా వకీల్ సాబ్ బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లలో టెన్షన్ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది.

వీకెండ్ వరకు వకీల్ సాబ్ కలెక్షన్లకు ఢోకా లేకపోయినా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఫ్యామిలీస్ ఈ సినిమాపై ఆసక్తి చూపిస్తాయా.? లేదా.? అనే సందేహం నెలకొంది.ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.

వకీల్ సాబ్ రిజల్ట్ పై ఒక అంచనకు రావాలంటే మాత్రం సోమవారం వరకు ఆగాల్సిందే.

Telugu Biggest, Box, Corona Effect, Love Story, Pawan Kalyan, Tuck Jagadeesh, Va

ఏప్రిల్ 16వ తేదీన విడుదల కావాల్సిన లవ్ స్టోరీ సినిమా వాయిదా పడటంతో వకీల్ సాబ్ కు టక్ జగదీష్ విడుదలయ్యే వరకు ఎలాంటి ఆటంకాలు ఉండవనే చెప్పాలి.పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధనలు అమలవుతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోయే రోజుల్లో ఈ నిబంధనలు అమలులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.

ఈ సినిమా 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధిస్తే మాత్రమే హిట్ మూవీ అనిపించుకుంటుంది.కొన్నేళ్ల క్రితం పవన్ నటించిన గబ్బర్ సింగ్ సినిమా విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకుని రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించగా వకీల్ సాబ్ కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube