ఫ్యాన్స్ కు శుభవార్త.. రీఎంట్రీ ఇస్తున్న పవన్ హీరోయిన్..?

తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో నటించి మిడిల్ రేంజ్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్నారు మీరా జాస్మిన్.తెలుగులో మీరా జాస్మిన్ భద్ర, అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, రారాజు, మహారధి, గోరింటాకు, బంగారు బాబు మరికొన్ని సినిమాల్లో నటించారు.

 Star Hero Pawan Kalyan Heroine Reentry In Telugu Movies-TeluguStop.com

మీరా జాస్మిన్ మలయాళంలో నటించిన పాదమ్ ఒన్న్ ఒరు విలాపం సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు రావడం గమనార్హం.

సౌత్ ఇండియా సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన మీరా జాస్మిన్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నారు.

 Star Hero Pawan Kalyan Heroine Reentry In Telugu Movies-ఫ్యాన్స్ కు శుభవార్త.. రీఎంట్రీ ఇస్తున్న పవన్ హీరోయిన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తెలుగులో మీరాజాస్మిన్ పవన్ కళ్యాణ్ కు జోడీగా గుడుంబా శంకర్ సినిమాలో నటించగా ఆ సినిమాలో పాత్ర మీరాజాస్మిన్ కు మంచిపేరు తెచ్చిపెట్టింది.కొన్నేళ్ల క్రితం మీరా జాస్మిన్ దుబాయ్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అనిల్ ను వివాహం చేసుకున్నారు.

పెళ్లి తరువాత మీరా జాస్మిన్ సినిమాలకు దూరంగా ఉన్నారు.

Telugu Gudumba Shankar, Malayalam Movie, Meera Jasmine, Pawan Kalyan Heroine-Movie

పెళ్లి తరువాత మీరా జాస్మిన్ దుబాయ్ కు షిఫ్ట్ అయ్యారు.పెళ్లి తరువాత సినిమాల్లో నటిస్తానని గతంలో చెప్పిన మీరా జాస్మిన్ మలయాళ డైరెక్టర్ సత్యన్ అంతికాడ్ డైరెక్షన్ చేస్తున్న ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.జులై నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.

దాదాపు ఐదు సంవత్సరాల తరువాత మీరా జాస్మిన్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండటం గమనార్హం.

సెకండ్ ఇన్నింగ్స్ లో మీరా జాస్మిన్ ఎలాంటి పాత్రలను ఎంపిక చేసుకుంటారో చూడాల్సి ఉంది.

చాలామంది సీనియర్ హీరోయిన్లు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుసగా ఆఫర్లను అందిపుచ్చుకుంటూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.మలయాళంలో రీఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్ తెలుగులో కూడా కొత్త సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

#Gudumba Shankar #Meera Jasmine #PawanKalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు