మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..?- Star Hero Pawan Kalyan Green Signal For One More Movie

star hero pawan kalyan green signal for one more movie, pawan kalyan ,star hero pawan kalyan, green signal, tollywood actress ,tollywood news - Telugu Green Siganl, Khiladi Movie, Pawan Kalyan, Ramesh Varma

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో వరుస సినిమాలకు కమిటవుతున్న సంగతి తెలిసిందే.పవన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా తెరకెక్కి సమ్మర్ లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.

 Star Hero Pawan Kalyan Green Signal For One More Movie-TeluguStop.com

పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ లో, క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ నటిస్తుండగా తాజాగా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

సెకండ్ ఇన్నింగ్స్ లో పవన్ కళ్యాణ్ ఇతర సినిమాలకు భిన్నంగా వరుస సినిమాలకు కమిటవుతూ ఉన్నారు.2024 ఎన్నికల లోపు పవన్ కళ్యాణ్ వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమాకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టిన రమేష్ వర్మ పవన్ కళ్యాణ్ కు కథ చెప్పి ఒప్పించారని తెలుస్తోంది.

 Star Hero Pawan Kalyan Green Signal For One More Movie-మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కుతున్నట్టు వార్తలు రాగా రమేష్ వర్మ సినిమాకే బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది.

మరోవైపు పవన్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.పవన్ సినిమాలు ఈ ఏడాది మూడు విడుదలయ్యే మూడు సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

అయితే పవన్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా స్టార్ డైరెక్టర్లకు ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.పవన్ సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న డైరెక్టర్లలో హరీష్ శంకర్ మినహా స్టార్ డైరెక్టర్ లు ఎవరూ లేకపోవడం గమనార్హం.పవన్ రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా రీమేక్ సినిమానో స్ట్రెయిట్ సినిమానో తెలియాల్సి ఉంది.

#Ramesh Varma #Pawan Kalyan #Green Siganl

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు