పవన్ కు ఇష్టమైన పుస్తకాలు ఏంటో మీకు తెలుసా..?

రేపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజనే సంగతి తెలిసిందే.పవన్ పుట్టినరోజు కానుకగా ఆయన సినిమాల అప్ డేట్స్ వస్తాయని పవన్ ఫ్యాన్స్ సంతోషంతో ఉన్నారు.

 Star Hero Pawan Kalyan Favourite Books Details, Details Here, Favourite Book, In-TeluguStop.com

పవన్ కళ్యాణ్ కు పుస్తకాలు అంటే ఎంతో ఇష్టమనే సంగతి తెలిసిందే.పుస్తకాలపై ఉన్న ఇష్టాన్ని పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో బహిరంగంగా వెల్లడించారు.

పవన్ కు ఇష్టమైన పుస్తకాల్లో తాకట్టులో భారతదేశం పుస్తకం కూడా ఒకటి.

ఈ పుస్తకంలోని అంశాలు తనపై చాలా ప్రభావం చూపాయని పవన్ ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు.

తరిమెల్ల నాగిరెడ్డి ఈ పుస్తకంను విశ్లేషించిన తీరు తనను ఆకట్టుకుందని పవన్ తెలిపారు.గడ్డి పరకతో విప్లవం పుస్తకం కూడా పవన్ కు ఇష్టమైన పుస్తకాల్లో ఒకటి.

సహజ పద్ధతిలో వ్యవసాయం చేయడం ద్వారా ఎక్కువ దిగుబడిని సాధించవచ్చని ఈ పుస్తకంలో రచయిత పేర్కొన్నారు.ఈ పుస్తకాన్ని చదివి అవగాహనను పెంచుకోవాలని పవన్ గతంలో ఒక సందర్భంలో సూచనలు చేశారు.

నెల్సన్ మండేలా లంగ్ వాక్ టు ఫ్రీడమ్ పుస్తకం కూడా పవన్ కు ఎంతో ఇష్టమైన పుస్తకాలలో ఒకటి.

Telugu Favourite, Gaddiparakatho, Martin Luther, Nelsonmandela, Pawan Kalyan, Va

నెల్సన్ మండేలా పోరాట పటిమ తనలో స్పూర్తి నింపిందని పవన్ గతంలో కామెంట్లు చేశారు.పవన్ కు ఇష్టమైన పుస్తకాలలో వనవాసి పుస్తకం కూడా ఒకటి.ఎంతో కష్టపడి వనవాసి పుస్తకాన్ని సంపాదించుకున్న పవన్ ఆ పుస్తకం దొరికనప్పుడు ఎంతో ఆనందం కలిగిందని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

Telugu Favourite, Gaddiparakatho, Martin Luther, Nelsonmandela, Pawan Kalyan, Va

మార్టిన్ లూథర్ కింగ్ పుస్తకాలను సైతం పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టపడతారనే సంగతి తెలిసిందే.లూథర్ కింగ్ పుస్తకాల ప్రభావం తనను కొన్ని సంవత్సరాల పాటు వెంటాడిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.ఆధునిక మహాభారతం పుస్తకం కూడా పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన పుస్తకాలలో ఒకటని చెప్పవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube