పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా వల్ల నిర్మాతలకు అన్ని కోట్ల నష్టం వచ్చిందా?

Star Hero Pawan Kalyan Agnatavasaasi Movie Losses Details Here

పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కొన్ని సినిమాలు మాత్రం నిర్మాతలకు ఊహించని స్థాయిలో నష్టాలను మిగిల్చాయి.పవన్ కెరీర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో అజ్ఞాతవాసి ఒకటి.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్సినిమాకు దర్శకత్వం వహించారు.2018 సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

 Star Hero Pawan Kalyan Agnatavasaasi Movie Losses Details Here-TeluguStop.com

మరోవైపు ఈ సినిమా హాలీవుడ్ సినిమాకు కాపీ అనే కామెంట్లు సైతం వినిపించడం గమనార్హం.నిన్నటికి ఈ సినిమా విడుదలై నాలుగు సంవత్సరాలు పూర్తైంది.ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా నటించగా ఈ సినిమా తర్వాత ఈ హీరోయిన్లకు సైతం సినిమా ఆఫర్లు తగ్గాయి.ఈ సినిమా కథనంలో లోపాలు ఉన్నా పవన్ కళ్యాణ్ నటనకు మాత్రం మంచి పేరు వచ్చింది.

సినిమా కలెక్షన్లు 57 కోట్ల రూపాయలు కాగా నష్టాలు 58 కోట్ల రూపాయలు అని సమాచారం.

 Star Hero Pawan Kalyan Agnatavasaasi Movie Losses Details Here-పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా వల్ల నిర్మాతలకు అన్ని కోట్ల నష్టం వచ్చిందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Agnatavasaasi, Agnyaatavaasi, Anu Emanuel, Keerthi Suresh, Pawan Kalyan, Tollywood-Movie

రికార్డు స్థాయిలో అజ్ఞాతవాసి సినిమాకు బిజినెస్ జరగడం వల్లే ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయి.అత్తారింటికి దారేది సినిమా తర్వాత అదే కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమా కొరకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు.అయితే అటు క్లాస్ ప్రేక్షకులను ఇటు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా ఫెయిలైంది.

సినిమా వల్ల బయ్యర్లకు నష్టాలు వచ్చాయి.

నష్టపోయిన బయ్యర్లను ఆదుకోవడానికి నిర్మాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం చేశారు.పవన్ కెరీర్ లోనే భారీ నష్టాలను మిగిల్చిన సినిమాగా ఈ సినిమా రికార్డులకెక్కింది.ఈ సినిమా తర్వాత రాజకీయాలతో బిజీ కావడంతో పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమయ్యారు.

అయితే రాజకీయాల్లో కూడా పవన్ కు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

#Anu Emanuel #Keerthi Suresh #Agnatavasaasi #Pawan Kalyan #Agnyaatavaasi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube