ఆ దర్శకునికి ఎన్టీఆర్ ఝలక్.. ఇప్పట్లో కష్టమే..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత కొన్నేళ్లుగా నటిస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

 Star Hero Ntr Huge Shock To Uppena Director Buchibabu Sana-TeluguStop.com

అరవింద సమేత వీర రాఘవ హిట్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాకే పరిమితం కావడం గమనార్హం.చరణ్ ఆచార్య సినిమాలో నటించినా ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమాకే పూర్తి సమయం కేటాయించారు.

అయితే కొన్నిరోజుల క్రితం ఎన్టీఆర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.ఉప్పెన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ ఈ దర్శకునికి ఆఫర్ ఇచ్చినట్టు వినిపించింది.

 Star Hero Ntr Huge Shock To Uppena Director Buchibabu Sana-ఆ దర్శకునికి ఎన్టీఆర్ ఝలక్.. ఇప్పట్లో కష్టమే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పట్లో ఈ దర్శకునితో ఎన్టీఆర్ సినిమా చేయడం కష్టమేనని సమాచారం.ప్రస్తుతం సెకండ్ వేవ్ వల్ల షూటింగ్ ఆగిపోవడంతో ఆర్ఆర్ఆర్ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Telugu Buchibabu Sana, Huge Shock, Ntr, Uppena Director-Movie

ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తైన వెంటనే ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో నటించబోతున్నారు.ఈ సినిమా షూటింగ్ ఆలస్యంగా ప్రారంభమైతే రిలీజ్ డేట్ కూడా మారే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి.ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా తెరకెక్కే అవకాశం ఎక్కువగా ఉంది.అందువల్ల ఇప్పట్లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా తెరకెక్కడం కష్టమేనని చెప్పవచ్చు.

ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు ఎన్టీఆర్ హీరోగా తరువాత సినిమాను తెరకెక్కిస్తారో లేక మరో హీరోతో సినిమాను తెరకెక్కిస్తారో చూడాల్సి ఉంది.మరికొన్ని రోజుల్లో బుచ్చిబాబు సానా తరువాత సినిమాకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.

బుచ్చిబాబు ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కితే మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించే అవకాశాలు ఉంటాయి.

#Buchibabu Sana #Uppena Director #Huge Shock

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు