సినిమాలు వదిలేద్దామని అనుకున్న కళ్యాణ్ కృష్ణకు నాగ్ ఇచ్చిన సలహా ఇదే!

సినిమా రంగంలో ఏ హీరోకైనా, ఏ డైరెక్టర్ కు అయినా సక్సెస్ ఫెయిల్యూర్ సాధారణమనే సంగతి తెలిసిందే.సక్సెస్ లో ఉన్న సమయంలో అడ్వాన్స్ లు ఇచ్చే నిర్మాతలు వరుసగా ఫెయిల్యూర్స్ వస్తే ఆ అడ్వాన్స్ లను వెనక్కు తీసుకోవాలని భావిస్తారు.

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కెరీర్ లో సోగ్గాడే చిన్నినాయన, రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలు సక్సెస్ సాధించగా నేల టిక్కెట్ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది.

మాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని కళ్యాణ్ కృష్ణ తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

అయితే కొన్నేళ్ల గ్యాప్ తర్వాత సోగ్గాడే చిన్నినాయన మూవీ కొనసాగింపు అయిన బంగార్రాజుతో కళ్యాణ్ కృష్ణ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.ఈ నెల 14వ తేదీన బంగార్రాజు సినిమా రిలీజ్ కానుండగా అతి త్వరలో బంగార్రాజు సినిమా ట్రైలర్ విడుదల కానుంది.

బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ కృష్ణ కీలక విషయాలను వెల్లడించారు.

Telugu Bangarraju, Kalyan Krishna, Naga Chaitanya, Nagarjuna, Nela Ticket, Ravit

బంగార్రాజు సినిమాలో లావణ్య త్రిపాఠి పాత్ర మాత్రం ఉండదని మిగిలిన అన్ని పాత్రలు ఈ సినిమాలో కూడా ఉంటాయని కళ్యాణ్ కృష్ణ అన్నారు.బంగార్రాజు మనవడి పాత్రలో చైతన్య కనిపిస్తుండగా నాగార్జున పాత్రకు, నాగచైతన్య పాత్రకు సమానంగా ప్రాధాన్యత ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని కళ్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చారు.బంగార్రాజు మూవీ మూడు తరాల పాత్రల మధ్య జరిగే కథ అని కళ్యాణ్ కృష్ణ తెలిపారు.

కెరీర్ పరంగా ఒడిదొడుకులు ఎదురైన సమయంలో సినిమాలు వదిలేయాలని అనుకున్నానని అయితే నాగార్జున మాత్రం తనకు అలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచనలు చేశారని కళ్యాణ్ కృష్ణ వెల్లడించారు.సినిమాలు మానేయాలని తాను తీసుకున్న నిర్ణయం కుటుంబ సభ్యులకు కూడా నచ్చకపోవడంతో వాళ్లు తనకు నచ్చజెప్పారని కళ్యాణ్ కృష్ణ చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube