అప్పుడు నాకు కొంచెం అనుమానంగానే ఉండేది.. నాగార్జున షాకింగ్ కామెంట్స్ వైరల్!

Star Hero Nagarjuna Shocking Comments About Bangarraju Movie

స్టార్ హీరో నాగార్జున చెప్పిన విధంగానే సంక్రాంతి పండుగకు బంగార్రాజు సినిమాను విడుదల చేసి సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.కథలో చిన్నచిన్న పొరపాట్లు ఉన్నా సినిమా మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

 Star Hero Nagarjuna Shocking Comments About Bangarraju Movie-TeluguStop.com

దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కథ, కథనం విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సినిమా మరింత పెద్ద సక్సెస్ సాధించి ఉండేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

నాగార్జున బ్రహ్మాస్త్ర సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ తొలి రోజుల్లో నాకు కొంచెం అనుమానంగానే ఉండేదని అన్నారు.అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా అలియా భట్, రణబీర్ కపూర్, అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

 Star Hero Nagarjuna Shocking Comments About Bangarraju Movie-అప్పుడు నాకు కొంచెం అనుమానంగానే ఉండేది.. నాగార్జున షాకింగ్ కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఏడాది బ్రహ్మాస్త్ర ఫస్ట్ పార్ట్ రిలీజ్ కానుంది.

దర్శకుడు అయాన్ ముఖర్జీ సంప్రదించిన సమయంలో కథలో మెయిన్ రోల్ అయితే మాత్రమే చేస్తానని నాగార్జున షరతు పెట్టారు.ఆ తర్వాత అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర షూట్ అయిన సీన్లను చూపించగా అయాన్ ముఖర్జీ పనితనం నచ్చడంతో ఈ సినిమాలో నటించడానికి నాగ్ అంగీకరించారు. బంగార్రాజు ప్రమోషన్స్ లో భాగంగా నాగ్ ఈ విషయాలను వెల్లడించారు.

గతంలో నాగ్ కొన్ని బాలీవుడ్ సినిమాలలో నటించి మెప్పించారు.చాలాకాలం తర్వాత నాగ్ మళ్లీ బాలీవుడ్ పై దృష్టి పెట్టారు.

బ్రహ్మాస్త్ర తెలుగులో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. బ్రహ్మాస్త్రం పేరుతో తెలుగులో ఈ సినిమా రిలీజ్ కానుంది.

నాగ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.స్టార్ హీరో నాగార్జున వయస్సుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ సత్తా చాటుతున్నారు.

ప్రస్తుతం నాగార్జున ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ది ఘోస్ట్ సినిమా తెరకెక్కుతోంది.

#Bramhastra #Alia Bahtt #Ranbeer Kapoor #Ayan Mukharjee #Bangarraju

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube