ఈతరం దర్శకులపై నాగ్ సీరియస్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోలలో కొత్త దర్శకులకు ఎక్కువగా సినిమా ఆఫర్లు ఇచ్చే హీరో ఎవరైనా ఉన్నారా అంటే ఆ హీరో నాగార్జున అనే చెప్పాలి.కథ నచ్చితే కొత్త దర్శకుడు, పాత దర్శకుడు అనే తేడాల్లేకుండా ఎంతోమంది దర్శకులకు అవకాశాలు ఇచ్చిన నాగార్జున కొన్నిసార్లు విజయాలను సొంతం చేసుకుంటే మరి కొన్నిసార్లు ఘోరమైన డిజాస్టర్లను చవిచూశారు.

 Star Hero Nagarjuna Serious On This Generation Directors-TeluguStop.com

నాగ్ హీరోగా తెరకెక్కి ఈ నెల 2వ తేదీన విడుదలైన వైల్డ్ డాగ్ సినిమాకు కూడా కొత్త డైరెక్టర్ డైరెక్షన్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈతరం దర్శకులపై నాగార్జున ఒక విషయంలో సీరియస్ అయ్యారు.

 Star Hero Nagarjuna Serious On This Generation Directors-ఈతరం దర్శకులపై నాగ్ సీరియస్.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాదాపు రెండు దశాబ్దాల క్రితం వరకు తక్కువ సమయంలోనే సినిమాల షూటింగ్ లు పూర్తయ్యేవి.ఆ కారణం వల్లే ఒకే ఏడాది సీనియర్ స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఒకే ఏడాదిలో పది కూడా రిలీజ్ అయ్యాయి.

కానీ ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుండటం గమనార్హం.

పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కడానికి సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల సమయం పడుతోంది.ఈతరం దర్శకులు 50 రోజుల్లో ఒక సినిమాను పూర్తి చేయాలని నాగార్జున సూచించారు.ఒక సినిమా కోసం దర్శకులు సంవత్సరాలు ఎందుకు తీసుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదని నాగార్జున పేర్కొన్నారు.90ల నుంచి వెనక్కు తీసుకొని రావాల్సిన క్వాలిటీ ఏమిటనే ప్రశ్నకు నాగార్జున ఈ విధంగా సమాధానమిచ్చారు.

తక్కువ రోజుల్లో షూటింగ్ జరిగితే నిర్మాతలకు ఖర్చు తగ్గడంతో పాటు ఎక్కువ సంఖ్యలో సినిమాలు రిలీజయ్యే అవకాశం ఉంటుంది.మరి నాగార్జున సూచనలను ఈతరం దర్శకులు ఫాలో అవుతారో లేదో చూడాల్సి ఉంది.

రానా నంబర్ 1 యారి షోకు హాజరైన నాగార్జున ఆ సమయంలో ఈతరం దర్శకులపై సెటైర్లు వేశారు.

#StarHero #ThisGeneration #WildDog #StarHero #New Direcctors

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు