అఖిల్ విషయంలో నాగ్ హ్యాపీ.. ఏం జరిగిందంటే..?

యంగ్ హీరో అఖిల్ హీరోగా నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోవడంతో పాటు అఖిల్ ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.అఖిల్ ఫ్యాన్స్ ఆశలన్నీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాపై ఉన్నాయి.

 Star Hero Nagarjuna Happy With Akhil Future Projects-TeluguStop.com

ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ లో రిలీజ్ కానుంది.ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాతో బిజీగా ఉన్నారు.

అయితే అఖిల్ సినిమాల ఎంపిక విషయంలో నాగార్జున హ్యాపీగా ఉన్నారని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తెరకెక్కనుండగా ఈ బ్యానర్ పై తెరకెక్కిన మెజారిటీ సినిమాలు హిట్లు కావడంతో ఈ సినిమాతో అఖిల్ తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడని నాగార్జున భావిస్తున్నారని తెలుస్తోంది.

 Star Hero Nagarjuna Happy With Akhil Future Projects-అఖిల్ విషయంలో నాగ్ హ్యాపీ.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పూజా హెగ్డే గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకోవడంతో ఆమె అఖిల్ కు కూడా సక్సెస్ ను ఇస్తుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Telugu Agent Movie, Akhil Akkineni, Future Projects, Most Eligible Bachelor, Nagarjuna, Surender Reddy-Movie

నాగార్జున కూడా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో మొదటి మూడు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ కాలేదు.నాగార్జున నాలుగో సినిమాతోనే సక్సెస్ ట్రాక్ లోకి రావడంతో అఖిల్ కూడా నాలుగో సినిమాతోనే సక్సెస్ ట్రాక్ లోకి వస్తాడని అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.ఇండస్ట్రీ వర్గాల్లో సైతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాపై బాగానే అంచనాలు ఉన్నాయి.

మరోవైపు సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఏజెంట్ సినిమాలో అఖిల్ లుక్ బాగుందంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.సైరా సినిమా తరువాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాతో అఖిల్ స్టార్ హీరోగా గుర్తింపును సొంతం చేసుకుంటాడని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

#Akhil Akkineni #MostEligible #Surender Reddy #Future Projects #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు