విడాకులపై తొలిసారి నోరువిప్పిన నాగచైతన్య.. సమంత హ్యాపీ అంటూ?

2021 సంవత్సరంలో అక్కినేని అభిమానులకు చైతన్య సమంత విడిపోవడంతో భారీ షాక్ తగిలింది.ఎవరూ ఊహించని విధంగా చై, సామ్ పరస్పర అంగీకారంతో విడిపోతున్నామని ప్రకటన చేశారు.

 Star Hero Nagachaitanya First Reaction About Divorce Details, Naga Chaitanya, Di-TeluguStop.com

ఆ ప్రకటన నిజం కాకపోతే బాగుంటుందని చాలామంది కోరుకున్నారు.విడాకుల ప్రకటన తర్వాత చైతన్య సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేరు.

సమంత మాత్రం విడాకుల విషయంలో పుకార్లను ఖండిస్తూనే అమ్మ చెప్పింది అంటూ పలు పోస్ట్ లను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

నాగచైతన్య, నాగార్జునతో కలిసి నటించిన బంగార్రాజు సినిమా విడుదల కావడానికి ఒక్కరోజు మాత్రమే ఉండటంతో చైతన్య ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

సమంతతో విడాకులపై ఎదురైన ప్రశ్న గురించి స్పందిస్తూ నా మంచికోసం, సమంత మంచికోసం విడాకుల నిర్ణయం తీసుకున్నామని చైతన్య వెల్లడించారు.విడాకుల వల్ల సమంత హ్యాపీ అని తాను కూడా హ్యాపీ అని చైతన్య కామెంట్లు చేశారు.

పరిస్థితులను బట్టి సమంతకు, తనకు ఈ నిర్ణయం మంచి నిర్ణయం అని నాగచైతన్య కామెంట్లు చేశారు.

Telugu Akkineni, Bangarraju, Divorce, Naga Chaitanya, Nagachaitanya, Nagarjuna,

విడాకుల తర్వాత సంతోషంగానే ఉన్నానని చైతన్య అన్నారు.సమంత పేరు ఎత్తకుండానే నాగచైతన్య ఈ కామెంట్లు చేయడం గమనార్హం.సమంత పరోక్షంగా విడాకుల అంశం గురించి పలు సందర్భాల్లో స్పందించినా ప్రత్యక్షంగా మాత్రం ఈ విషయం గురించి కామెంట్లు చేయలేదు.

Telugu Akkineni, Bangarraju, Divorce, Naga Chaitanya, Nagachaitanya, Nagarjuna,

శాకుంతలం లేదా ఇతర సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత కూడా విడాకుల అంశం గురించి నోరు విప్పుతారేమో చూడాలి.చై, సామ్ విడాకులకు దారి తీసిన కారణాలు మాత్రం వెలుగులోకి రాలేదు.బంగార్రాజు సినిమా నాగచైతన్య ఖాతాలో మరో హిట్ గా నిలుస్తుందేమో చూడాలి.లవ్ స్టోరీ సక్సెస్ తర్వాత చైతన్య నటించి రిలీజవుతున్న సినిమా బంగార్రాజు కావడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube