సమంత కాకుండా చైతన్యకు ఇష్టమైన స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

చైతన్య సమంత విడిపోయినా పలు ఇంటర్వ్యూలలో నాగచైతన్య సమంత గురించి పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.విడాకుల ప్రకటన తర్వాత చైతన్య తను సంతోషంగానే ఉన్నానని వెల్లడించారు.

 Star Hero Nagachaitanya Favourite Heroines Details Here  , Interesting Facts, Mu-TeluguStop.com

సమంతతో విడిపోయినా విడాకుల వల్ల బాధ కలగలేదని చైతన్య చెప్పకనే చెప్పేశారు.లాల్ సింగ్ చద్దా సినిమాతో నాగచైతన్య బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమాకు నాగచైతన్య పాత్ర ఎంతో కీలకమని సమాచారం.సమంతతో నటించే సమయంలో తాను కంఫర్టబుల్ గా ఫీలవుతానని చెప్పిన నాగచైతన్య సమంత కాకుండా బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, అలియా భట్ ఇష్టమని చెప్పుకొచ్చారు.

భవిష్యత్తులో నాగచైతన్య ఈ హీరోయిన్లకు జోడీగా నటించే ఛాన్స్ దక్కితే నటిస్తారో లేదో చూడాల్సి ఉంది.

నాగచైతన్య భవిష్యత్తు ప్రాజెక్టులు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయి.

నాగచైతన్య ప్రస్తుతం ఇతర ఇండస్ట్రీలపై కూడా దృష్టి పెడుతూ కథ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో చైతన్య నటిస్తే ఈ హీరోకు సక్సెస్ రేట్ మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంది.

గతంతో పోలిస్తే చైతన్య ఖాతాలో హిట్ల సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగింది.

నాగార్జున, చైతన్య కాంబినేషన్ లో సినిమా వస్తే ఆ సినిమా గ్యారంటీగా సక్సెస్ సాధిస్తుందని ప్రేక్షకులు నమ్ముతున్నారు.అక్కినేని హీరోలు మరిన్ని మల్టీస్టారర్ సినిమాలలో నటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.నాగచైతన్య ఇతర ఫ్యామిలీల స్టార్ హీరోలతో కలిసి నటిస్తే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ నాగచైతన్య కాంబినేషన్ లో సినిమా కొరకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.గుండమ్మ కథ రీమేక్ లో ఈ హీరోలు నటిస్తే బాగుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Akkineni Naga Chaitanya Favorite Heroines

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube