జూనియర్ ఎన్టీఆర్ కు దేవుడిచ్చిన తమ్ముడు ఎవరో తెలుసా..?  

Hero junior NTR Praises Ram Charan, Ram Charan, NTR, Own brother, RRR,Rajamouli - Telugu @alwaysramcharan, @tarak9999, Hero Junior Ntr Praises Ram Charan, Junior Ntr, Ntr, Own Brother, Rajamouli, Ram Charan, Rrr

నిన్నుచూడాలని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసి కెరీర్ మొదట్లోనే ఆది, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్.ఎలాంటి పాత్రలో నటించినా తన నటనతో ఆ పాత్రను, ఆ సినిమాను ఎన్టీఆర్ మరో లెవెల్ కు తీసుకెళుతారు.

TeluguStop.com - Star Hero Junior Ntr Praises Ram Charan

గత కొన్నేళ్ల నుంచి వరుస విజయాలతో జోష్ మీదున్న ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నారు.
దాదాపు 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరెకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ కరోనా, లాక్ డౌన్ వల్ల ఆలస్యమవుతోంది.

మాస్ లో భీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు.నందమూరి వారసునిగా నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.ఎన్టీఆర్ వ్యక్తిగత విషయాలకు వస్తే నిజ జీవితంలో ఆయనకు అన్న కళ్యాణ్ రామ్, అక్క నందమూరి సుహాసిని ఉన్నారు.
అయితే వీళ్లతో పాటు తనకు మరో తమ్ముడు కూడా ఉన్నాడని.

TeluguStop.com - జూనియర్ ఎన్టీఆర్ కు దేవుడిచ్చిన తమ్ముడు ఎవరో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

దేవుడిచ్చిన ఆ తమ్ముడు రామ్ చరణ్ అని ఎన్టీఆర్ తాజాగా ఒక ఇంటర్వూలో చెప్పారు.యమదొంగ సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఎంతో ఆనందంగా ఉందని.

ఆర్ఆర్ఆర్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం కావడం, స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి నటిస్తూ ఉండటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని వెల్లడించారు.
రామ్ చరణ్ తో తనకు ఎప్పటినుంచో బాండింగ్ ఉందని.

అతనిని నా తమ్ముడితో సమానంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.సరైన కథ దొరికితే రామ్ చరణ్ తో కానీ ఇతర హీరోలతో కానీ కలిసి పని చేయడానికి సిద్ధమేనని వెల్లడించారు.

మెగా, నందమూరి అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ ఉన్నా స్టార్ హీరోలు కలిసిమెలిసి అన్యోన్యంగా మెలుగుతూ ఉండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

#Junior NTR #Ram Charan #@tarak9999 #Own Brother #HeroJunior

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Star Hero Junior Ntr Praises Ram Charan Related Telugu News,Photos/Pics,Images..