జల్లికట్టులో జూనియర్ ఎన్టీఆర్.. ఫోటో వైరల్..!  

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా నుంచి నవ్యత ఉన్న, ప్రేక్షకులు కోరుకునే పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తుండగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

TeluguStop.com - Star Hero Junior Ntr Jallikattu Photos Viral In Social Media

అయితే జూనియర్ ఎన్టీఆర్ జల్లికట్టు వేడుకల్లో మెరిశారు.జూనియర్ ఎన్టీఆర్ జల్లికట్టు వేడుకలకు వెళ్లడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా.? ఎన్టీఆర్ జల్లికట్టు వేడుకలకు వెళ్లకపోయినా ఆయన అభిమానులు మాత్రం ఎన్టీఆర్ ఫోటోలతో జల్లికట్టు వేడుకల్లో సందడి చేశారు.

ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ సమయంలో చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో జల్లికట్టు వేడుకలు జరుగుతాయనే సంగతి తెలిసిందే.

TeluguStop.com - జల్లికట్టులో జూనియర్ ఎన్టీఆర్.. ఫోటో వైరల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ ఏడాది కూడా జల్లికట్టు వేడుకలు జరగగా జిల్లాలోని రామచంద్రాపురంలోని అన్పుపల్లి గ్రామంలో కొందరు ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఫోటోలను పోట్లగిత్తల కొమ్ములకు పెట్టారు.ఎన్టీఆర్ ఫోటోలతో ఉన్న పోట్లగిత్తల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

పోట్లగిత్తలను అందంగా ముస్తాబు చేయడంతో పాటు ఎన్టీఆర్ ఫోటోలను పెట్టి కొందరు అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.యువకులు జల్లికట్టు వేడుకల్లో భాగంగా పోట్లగిత్తల కొమ్ములను వంచటానికి ఆసక్తి చూపారు.అయితే వేడుకల్లో పాల్గొన్న ప్రజలు కరోనా నిబంధనలను పాటించకపోవడం గమనార్హం.అన్పుపల్లి గ్రామంలో జరిగిన జల్లికట్టు వేడుకలను చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతమవుతుందని భావిస్తున్నారు.అయితే ఆర్ఆర్ఆర్ తరువాత మాత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథతో తెరకెక్కనుందని తెలుస్తోంది.

ఈ సినిమాకు చౌడప్ప నాయుడు అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం.ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.

#Jallikattu #Star Hero Ntr

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు