9 నెలల గృహనిర్బంధంలో స్టార్ హీరో.. అతను ఎవరంటే?

మలయాళ సినిమా స్టార్ హీరోలలో మమ్ముట్టి ఒకరు.నటన విషయంలో మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

 Mammutty,hero Mammutty,house Arrest,9 Months House Arrest,corona Virus, Malayala-TeluguStop.com

కేవలం మలయాళ సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు తెరకు కూడా మమ్ముట్టి పరిచయమే.సూర్య ది గ్రేట్ లాయర్ ది గ్రేట్, దళపతి వంటి చిత్రాలలో నటించినప్పటికీ, వైయస్సార్ పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన “యాత్ర”సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

మమ్ముట్టి ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆ పనికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా తప్పకుండా అది నెరవేరే వరకు ఎంతో కష్టపడే తత్వం కలిగిన వాడు.తాను ఏ పని అయినా చేయాలని నిర్ణయం తీసుకుంటే ఆ పని కచ్చితంగా చేసి చూపిస్తారు.

ఇదే తరహాలోనే ఈ ఏడాది కరోనా మహమ్మారి విజృంభించడంతో దేశం మొత్తం లాక్ డౌన్ విధించింది.ప్రజలందరూ ఇళ్లకు పరిమితమైతే ఈ వ్యాధిని అరికట్టవచ్చన్న ఉద్దేశంతో లాక్ డౌన్ విధించింది.

కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని.ఏదో ఒక పని నిమిత్తం బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు కచ్చితంగా ఏర్పడతాయి.

Telugu Corona, Mammutty-Movie

ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన అనేక కారణాలతో చాలామంది అనవసరంగా బయట తిరుగుతూ ఈ వైరస్ వ్యాప్తిని ఉధృతం చేస్తున్నారు.ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మలయాళ నటుడు మమ్ముట్టి దాదాపు తొమ్మిది నెలల పాటు గృహ నిర్బంధంలో ఉన్నాడు.ఏ కారణం చేత ఈ 275 రోజులు బయటకు రాకుండా కేవలం ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు.ప్రతిరోజు ఎంతో బిజీగా గడిపే వారు ఇలా తొమ్మిది నెలల పాటు గృహనిర్బంధంలో ఉండాలంటే అది కష్టంతో కూడుకున్న పని.ఈ లాక్ డౌన్ ఒక ఛాలెంజ్ గా తీసుకొని 9 నెలల పాటు గృహనిర్బంధంలోనే ఉండిపోయారు.

ఈ తొమ్మిది నెలల పాటు ఎలాంటి అత్యవసర సమయాలలో కూడా బయటకు రాకుండా గృహనిర్బంధంలోనే ఉండిపోయిన మమ్ముట్టి తాజాగా 9 నెలలు పూర్తవడంతో శుక్రవారం ఇంటి నుంచి బయటకు వచ్చి సరదాగా తన స్నేహితులతో కలసి టీ తాగుతూ తన ఛాలెంజ్ పూర్తి చేశాడట.

అయితే ఈ తొమ్మిది నెలల పాటు గృహనిర్బంధంలో ఉన్న మమ్ముట్టి తన శరీర ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube