మహేష్ కు కొత్త తలనొప్పి.. నమ్రతను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు?  

Star Hero Fans Trolls Namrata, namrata Shirodkar, Drugs Allegations, mahesh babu wife - Telugu Drugs Allegations, Mahesh Babu, Mahesh Babu Wife, Namrata Drugs, Namrata Shirodkar, Star Hero Fans Trolls Namrata

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి గురించి చేసిన దర్యాప్తులో డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.డ్రగ్స్ దందా గురించి సీబీఐ అధికారులు, నార్కోటిక్ అధికారులు పలువురు హీరోయిన్లను, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులను విచారణ జరుపుతుండగా నిన్నటి నుంచి మాజీ హీరోయిన్, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ పేరు వార్తల్లోకెక్కింది.

TeluguStop.com - Star Hero Fans Trolls Namrata Sirodkar As She Faces Drug Allegations

ఇండియాటుడే న్యూస్ ఛానెల్ లో బాలీవుడ్ సెలబ్రిటీ మేనేజర్ జయసాహను విచారించినపుడు నమ్రత పేరు ఆమె వెల్లడించినట్టు కథనాలు ప్రసారమయ్యాయి.

అయితే ఈ వ్యవహారమంతా మహేష్ బాబుకు తలనొప్పిగా మారింది.

TeluguStop.com - మహేష్ కు కొత్త తలనొప్పి.. నమ్రతను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నమ్రత టీమ్ డ్రగ్స్ వార్తలను ఖండించినా నమ్రత కానీ, మహేష్ బాబు కానీ ఈ వార్తల గురించి స్పందించలేదు.దీంతో నెటిజన్లు, ఇతర హీరోల ఫ్యాన్స్ నమ్రతను టార్గెట్ చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.డ్రగ్ అడిక్ట్ నమ్రత, అరెస్ట్ నమ్రత అనే హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

15 సంవత్సారాల నుంచి నటనకు పూర్తిగా దూరమైన నమ్రత పేరు వినిపిస్తుండటంతో మరి కొందరు టాలీవుడ్ హీరోహీరోయిన్ల పేర్లు డ్రగ్స్ కేసులో వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ గతంలో నమ్రత చేసిన వ్యాఖ్యల వల్ల ఆమె హ్యాష్ ట్యాగ్స్ ను భారీగా ట్రెండ్ చేస్తుండటం గమనార్హం.

గతంలో ఒక నెటిజన్ తమ ఫేవరెట్ స్టార్ హీరో గురించి స్పందించమని నమ్రతను కోరాడు.
అయితే ఆమె స్పందిస్తూ ఆ హీరో గురించి తనకు పెద్దగా తెలియదని కామెంట్ చేసింది.

ఆ సమయంలో ఆ హీరో ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.దీంతో ప్రస్తుతం నెటిజన్లు ట్రోల్ చేస్తుంటే ఆ హీరో ఫ్యాన్స్ హ్యాష్ ట్యాగ్స్ ను ట్రెండ్ చేస్తున్నారు.

ఆ స్టార్ హీరో వరుస విజయాలు అందుకుంటున్న డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో ఒక స్టార్ హీరో కావడం గమనార్హం.

#StarHero #Mahesh Babu #Namrata Drugs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Star Hero Fans Trolls Namrata Sirodkar As She Faces Drug Allegations Related Telugu News,Photos/Pics,Images..