Balakrishna Jagan:వీరసింహారెడ్డిలో అలాంటి డైలాగ్స్.. ఏపీ సీఎంకు బాలయ్య భారీ షాకివ్వనున్నారా?

బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా వీరసింహారెడ్డి కాగా ఈ సినిమా సంక్రాంతి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.బాలయ్య ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా ఉండగా బాలయ్య గత సినిమాలలో ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ కొన్ని డైలాగ్స్ ఉన్నాయనే సంగతి తెలిసిందే.

 Star Hero Balakrishna Veerasimhareddy Movie Dialogues Details, Balakrishna, Cm J-TeluguStop.com

అయితే గోపీచంద్ మలినేని మూవీలో కూడా అలాంటి డైలాగ్స్ ఉన్నాయని బోగట్టా.

వీరసింహారెడ్డి సినిమాకు సాయిమాధవ్ బుర్రా మాటల రచయితగా వ్యవహరించారు.

సాయిమాధవ్ బుర్రా కూడా టీడీపీకి వీరాభిమాని కావడంతో జగన్ సర్కార్ ను టార్గెట్ చేసే దిశగా డైలాగ్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం.జగన్ సర్కార్ ఆంధ్రలో ఏ మాత్రం అభివృద్ధి చేయడం లేదనే విధంగా ఈ డైలాగ్స్ ఉండనున్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

స్కూళ్లను, ఆస్పత్రులను కొత్తగా మార్చినంత మాత్రాన అభివృద్ధి జరిగినట్టు కాదని బాలయ్య డైలాగ్స్ చెప్పనున్నారని బోగట్టా.

Telugu Balakrishna, Cmjagan-Movie

ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా డైలాగ్స్ ఉంటే వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ఏపీ సీఎం జగన్ కు షాకిచ్చే దిశగా డైలాగ్స్ ఉండేలా బాలయ్య జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అఖండ సినిమాలో కూడా జగన్ సర్కార్ ను టార్గెట్ చేసే డైలాగ్స్ ఉన్నాయనే సంగతి తెలిసిందే.

Telugu Balakrishna, Cmjagan-Movie

బాలయ్య బోయపాటి శ్రీను కాంబో మూవీ కూడా పొలిటికల్ కథాంశంతోనే తెరకెక్కుతోంది.2024 ఎన్నికల ముందు ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉంది.బాలయ్య పొలిటికల్ కథాంశాలకు ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.బాలయ్య మాస్ యాక్షన్ కథలకు పెద్దపీట వేస్తూ ఆ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.

సినిమాసినిమాకు బాలయ్య రేంజ్ పెరుగుతుండగా బాలయ్యను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube